Gas Trouble: గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:30 AM, Sun - 3 November 24

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రకరకాల జంక్ ఫుడ్స్,ఫాస్ట్ ఫుడ్స్,అలాగే కూల్ డ్రింక్స్ ఇంకా చాలా రకాల మసాలా పదార్థాలు తినడం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసు వారు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ లో టాబ్లెట్స్ లేదంటే ఈనో ప్యాకెట్స్ వంటి ఉపయోగించడం వల్ల ఒక వయసు వచ్చేసరికి కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి.
అయితే గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే హెర్బల్ టీ తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుందట. అయితే ఈ రెండు పానీయాలు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయని చెబుతున్నారు. కొబ్బరి నీరు, సోంపు వాటర్ కూడా మంచి రిలీఫ్ ని ఇస్తుంది. జీర్ణ సమస్యలకు మరొక ఇంటి నివారిణి అల్లం. ఇందులో ఉండే యాన్ఫ్లమేటరీ గుణాలు, గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్స్ గుండెల్లో మంట నుంచే ఉపసమనం పొందడంలో సహాయపడతాయట.
దీన్ని టీ రూపంగాను, కషాయం రూపంలో తాగటం వల్ల ఉపశమనం లభిస్తుందట. గ్యాస్ ట్రబుల్ వచ్చిన దగ్గర నుంచి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. పాలు, పాల పదార్థాలు, కార్బోనేటెడ్ పానీయాలు సోడాలు వంటివి మీ ఆహారంలో ఉండకుండా చూసుకోండి. అలాగే శారీరకంగా చురుకుగా ఉండటం, జీర్ణ ఆరోగ్యానికి కీలకం వాకింగ్, స్విమ్మింగ్, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామ పద్ధతిలో మీరు గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది మీ చాతి నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే మసాలా దినుసులని కూడా మీ ఆహారం నుంచి తొలగించాలి. భోజనం విషయంలో సమయపాలన పాటించండి దీని వలన వీలైనంత వరకు గ్యాస్ సమస్యలను దూరంగా ఉంచవచ్చని చెబుతున్నారు..