Immunity Boosters: వర్షాలు ఎక్కువగా పడుతున్నాయా.. అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ పండ్లు తినాల్సిందే!
Immunity Boosters: వర్షాలు పడుతున్న సమయంలో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏవి అన్న విషయానికొస్తే..
- By Anshu Published Date - 07:30 AM, Fri - 3 October 25

Immunity Boosters: వర్షాకాలం తో పాటు కొన్ని కొన్ని సార్లు వాతావరణం లో చిన్న చిన్న మార్పులు కారణంగా ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ వర్షాలు ఎక్కువగా పడినప్పుడు తొందరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. తొందరగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే అలా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీ అవసరం. అయితే ఈ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి తప్పకుండా కొన్ని రకాల పండ్లు తినాలట. ఇంతకీ ఆ పండ్లు ఏవి అన్న విషయానికి వస్తే.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన వాటిలో నేరేడు పండు కూడా ఒకటి.
దీనిని ఇండియన్ బ్లాక్‌బెర్రీ అని కూడా పిలుస్తారట. ఇది వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీనిలో విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి రక్తప్రసరణను మెరుగుపరచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. వర్షాకాలంలో వచ్చే అతిసారం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుందట. అలాగే నేరేడు పండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే వర్షాకాలంలో తినాల్సిన పండ్లలో లిచి కూడా ఒకటి. ఇది జ్యూసీ, గొప్ప పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.
ఇది రోగనిరోధక శక్తిని పెంచి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందట. లిచిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల తేమతో కూడిన వాతావరణంలో శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందట. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయని, ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుందని, వర్షాకాలంలో సహజమైన మెరుపును ఇస్తుందని చెబుతున్నారు. పియర్స్.. వర్షాకాలంలో దొరికే ఈ పండు వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయట. దీనిలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుందని,ఇది మలబద్ధకాన్ని నివారిస్తుందని, ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయని, విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయని చెబుతున్నారు.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన హార్ట్ హెల్త్ ని అందించడంలో బాగా హెల్ప్ చేస్తుందట. అలాగే ప్లం ఫ్రూట్ లలో కూడా విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయట. ఇవి పుల్లని,తీపి రుచిని కలిగి ఉంటాయట. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయట. వర్షాకాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయని, దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ లక్షణాలు శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. దానిమ్మను కూడా వర్షాకాలంలో తింటే మంచిదట. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియంను రోగనిరోధక శక్తిని పెంచుతాయని, ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుందట. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందని, దీనిలోని ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారిస్తుందని, హైడ్రేటింగ్ లక్షణాలు అందించి స్కిన్ ని హెల్తీగా చేస్తుందని చెబుతున్నారు.