Multani Mitti: ముల్తానీ మట్టి నిజంగా అందానికి మేలు చేస్తుందా?
ముల్తానీ మట్టి అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:02 PM, Thu - 7 November 24

ముల్తానీ మట్టి అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఎప్పటినుంచో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఈ ముల్తానీ మట్టిని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో ముల్తానీ మట్టిని నేరుగా ముఖానికి అప్లై చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం ముల్తానీ మట్టితో రకరకాల సోపులు ఫేస్ క్రీములు ఫేస్ వాష్ లు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. కాగా ఈ ముల్తానీ మట్టి తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ముల్తానీ మట్టి ముఖం చర్మంపై ఉండే రంధ్రాలను మూసేసి బిగుతుగా మారుస్తుంది. దీని వల్ల చర్మం ఆకృతి మెరుగ్గా ఉంటుంది. ఈ బంకమట్టి చర్మాన్ని టోన్ చేయడానికి, కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. ముల్తానీ మట్టి చర్మంపై ఉండే రంధ్రాలను ఆయిల్ ఫ్రీ చేస్తుంది. దీంతో మొటిమల సమస్యను తొలగిపోతుంది. ముల్తానీ మట్టిని ఉపయోగించడానికి మీరు దీనిని రోజ్ వాటర్ వంటి ఇతర వస్తువులతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ ను వేసుకోవచ్చు.
ఈ ముల్తానీ మట్టి మొటిమలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని గ్రైండ్ గంధం, రోజ్ వాటర్, వేప ఆకుల పొడితో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లైచేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే పింపుల్స్ మాయం అవ్వడం ఖాయం. ఇక జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్టులా తయారు చేసి ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
అప్లై చేసేటప్పుడు పెదాలు కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాలకు తాగకుండా అప్లై చేసుకోవాలి అని చెబుతున్నారు. ఇక మీ చర్మం న్యాచురల్ గా నార్మల్ గా ఉండాలి అంటే ముల్తానీ మట్టి తేనె పెరుగులో మిక్స్ చేసి పేస్టులా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. మొటిమల వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అయితే ముల్తానీ మట్టి కూడా ఆ మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలట. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలట.