Garlic: టీ,కాఫీలకు బదులుగా పరగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు ఉదయాన్నే టీ కాఫీలకు బదులుగా వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో రకాల మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Thu - 1 May 25

మన వంటింట్లో దొరికే వాటిలో వెల్లుల్లి లేదా తెల్లవాయ కూడా ఒకటి. దీనిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. వెల్లుల్లి ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వం నుంచి ఎన్నో ఔషధాల తయారీలో వెల్లుల్లిని ఉపయోగిస్తూనే ఉన్నారు. వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వెల్లుల్లి తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీనిని నేరుగా లేదంటే కూరల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇకపోతే ఉదయాన్నే చాలామందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది. వీటికి బదులుగా ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
మరి ఉదయాన్నే కాఫీ టీకి బదులుగా వెల్లుల్లి తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వెల్లుల్లో ఘాటైన వాసనకు కారణమయ్యే సల్ఫ్యూరిక్ సమ్మేళనం. ఈ అల్లిసిన్ మన శరీరంలోని తెల్ల రక్త కణాల కార్యకలాపాలను మెరుగుపరుస్తుందట. ఇవి ఇన్ఫెక్షన్లు, ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
పొద్దున్నే పరిగడుపున వెల్లుల్లిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అలాగే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం అంత తగ్గుతుందట. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా తొందరగా తగ్గుతుందట. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు పరిగడుపున వెల్లుల్లిని తింటే మంచి ప్రయోజనం ఉంటుందట.
వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందట. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. పచ్చి వెల్లుల్లి రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుందట. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుందట. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయట. ఇవి మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయట. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయట. క్రమం తప్పకుండా పచ్చి వెల్లుల్లిని తింటే మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందట. ఇది గ్యాస్ట్రిక్ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందట. దీంతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమవుతుందట.
వెల్లుల్లిలో ఉండే ప్రీబయోటిక్ లక్షణాలు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతాయట. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగైన పోషకాల శోషణకు కూడా సహాయపడుతుందట. అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. కాగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కాలేయం పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందట. ఇది రక్త ప్రవాహంలో ఉన్న హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. ఇది తరచుగా డిటాక్సిఫికేషన్ అవయవాలపై భారాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెబుతున్నారు. రక్తంలో చర్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా వెల్లుల్లి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. మీ రక్తంలో చక్కెర్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురైతే మీరు రోజూ పరిగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలని చెబుతున్నారు. వెల్లుల్లి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందట. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు.