Jeera Water: జీరా వాటర్ ని ఉదయం సాయంత్రం తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
జీరా వాటర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఉదయం సాయంత్రం జీరా వాటర్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:30 PM, Tue - 6 May 25

జీరా వల్ల అనేక లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. జీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రను ఎన్నో రకాల వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. జీరా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలను తగ్గించడానికి జీరా వాటర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు గ్యాస్,అసిడిటి, మలబద్ధకం,వంటి సమస్యలు ఉన్నవారు జీరా వాటర్ తాగడం మంచిదని చెబుతున్నారు. జీరా వాటర్ లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. ఈ వాటర్ లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే డిహైడ్రేషన్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ వాటర్ ను రాత్రి పూట తాగితే తరచుగా దాహం వేయకుండా ఉంటుందట. ఉదయం రాత్రి పూట క్రమం తప్పకుండా తాగుతూ ఉండటం వల్ల రక్తంలో ఆకస్మాత్తుగా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుందట. జీరా వాటర్ తాగితే ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.
కొలస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి జీరా వాటర్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జీరా వాటర్ తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందట. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయట. కాబట్టి జీరా వాటర్ ను తాగడం వల్ల ప్రయోజనాలు తప్ప ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు. అలా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు.