Coconut Water: కొబ్బరినీళ్లను అవాయిడ్ చేస్తున్నారా.. అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే!
కొబ్బరినీళ్ల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:35 PM, Wed - 13 November 24

కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కొబ్బరినీరు టేస్టీగా ఉండటంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయట. అసలు కొబ్బరి నీటిని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే డీహైడ్రేషన్ ఒక్కోసారి మన ప్రాణాలను కూడా తీసేయగలదట.
కాగా కొబ్బరి నీరు అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయట. ఇవి చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి సహాయపడతాయట. ఈ ఖనిజాలు శరీరం ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి, నిర్జలీకరణాన్ని నివారించడానికి ఎంతో సహాయపడతాయట. అలాగే కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, అలాగే అమైనో ఆమ్లాలతో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయట.
విటమిన్ సి మన రోగనిరోధక పనితీరును మెరుగుపర్చడానికి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుందట. ఇకపోతే బి విటమిన్లు శక్తి జీవక్రియకు దోహదం చేస్తాయట. కొబ్బరి నీటిలోని అమైనో ఆమ్లాలు కణజాల మరమ్మత్తు, కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయట. ఇది వ్యాయామం తర్వాత తాగాల్సిన అద్భుతమైన పానీయం అని చెబుతున్నారు. అమైలేస్, కాటలేస్, ఫాస్ఫేటేస్ వంటి కొబ్బరి నీటిలో ఉండే ఎంజైమ్లు ఆహార కణాలను విచ్ఛిన్నం చేస్తాయట. అలాగే పోషక శోషణను ప్రోత్సహిస్తాయట. దీంతో జీర్ణక్రియను సులభతరం చేస్తాయని, ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుందట..ఇది అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుందని చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట. సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, సోడైలేషన్ ను ప్రోత్సహించి, పొటాషియం రక్తపోటు, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కొబ్బరి నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మానికి సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. మీ చర్మం యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచుతాయి. అలాగే చర్మ మృదుత్వాన్ని మరింత పెంచుతుంది. ఇది మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది.
కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో సహాయపడుతుందట.
కొబ్బరి నీరు చక్కెర పానీయాలకు సంతృప్తికరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అలాగే ఆహార కోరికలను కూడా తగ్గిస్తుందట. కొబ్బరి నీరు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుందట. మూత్ర ఉత్పత్తిని ప్రోత్సహించి, మూత్రపిండాల పనితీరుకు మద్దతునిస్తాయి. అలాగే శరీరంలోని విషం బయటకు వెళ్లేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. అలాగే మీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాబట్టి వీటి దర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వీటివల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయని చెబుతున్నారు..