Beauty Tips: స్కిన్ మెరిసి పోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే!
మాములుగా ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకోవడంతో పాటు అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 03:18 PM, Sun - 7 July 24

మాములుగా ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకోవడంతో పాటు అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి, అందంగా మారెందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈజీగా ఉండే బ్యూటీ టిప్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందంగా ఉండాలని కోరుకునే వారు తప్పకుండా సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగాలి. ప్రతిరోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగినట్లయితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
అయితే శరీరం ఎప్పుడైతే హైడ్రేటెడ్ గా ఉంటుందో అప్పుడు చర్మం అందాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా తగినన్ని నీటిని తాగాలి. అలాగే వేపాకులను కూడా నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నిగారింపును సంతరించుకుంటుంది. చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. శరీరం పైన వచ్చే అనేక ఎలర్జీలు కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా లేత కొబ్బరి తో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం చాలా నిగారింపును సంతరించుకుంటుంది. లేత కొబ్బరి తో వేసుకునే ఫేస్ ప్యాక్ మెరుపు అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. అందమైన చర్మం కోసం ఆర్టిఫిషియల్ గా మార్కెట్లో దొరికే క్రీమ్ లను ఉపయోగించే కంటే సహజ పద్ధతులతోనే అందంగా మారవచ్చు.
ఇక మనం ఇంట్లోనే తయారు చేసుకునే బొప్పాయి, టమోటా ఫేస్ ప్యాక్ లు కూడా అందాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. కాగా చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా అవసరం కాబట్టి ఎక్కువగా పండ్ల రసాలు తాగడంతో కూడా చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మన స్కిన్ నిగారింపును సొంతం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తల స్నానం చేసిన తర్వాత కొంచెం నీటిలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాస్తే కుదుళ్లు గట్టిగా తయారవుతాయట. జుట్టు రాలడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఉప్పు నీటితో కంటిని కడగడం వల్ల కళ్ళు మెరుపును సంతరించుకుంటాయి. అందంగా ఉండాలని కోరుకునే వారు అప్పుడప్పుడు ముఖానికి స్టీమ్ పెట్టుకోవడం మంచిది. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంలో ముడుచుకుపోయిన స్వేద గ్రంధులు శుభ్రపడి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు, దుమ్ము ఆవిరి పట్టడం వల్ల తొలగిపోతాయి. దీంతో కూడా ఫేస్ చాలా ఆకర్షణీయంగా,యాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల అందమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
note : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.