Vitamin B: విటమిన్ బీ.. ఏ విటమిన్ ఏ అవయవానికి పనికొస్తుందంటే?
సాధారణంగా శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలి అన్న, చురుగ్గా పనిచేయాలి అంటే వాటికి కావాల్సిన
- By Nakshatra Published Date - 08:45 AM, Sun - 7 August 22
సాధారణంగా శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలి అన్న, చురుగ్గా పనిచేయాలి అంటే వాటికి కావాల్సిన పోషకాలు అందాలి. అయితే శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ కూడా కావాలి. అయితే మనం మెదడు చురుగ్గా పనిచేయాలి అంటే బీ విటమిన్లు కీలకం. అయితే విటమిన్ బి లోపం వల్ల డిప్రెషన్, మానసికపరమైన సమస్యలు, మానసిక వైకల్యం లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి లోపాలు ఎక్కువగా వయసు మీద పడే వారిలో సరైన పోషకాహారం తీసుకోకుండా ఉండడం వల్ల కనిపిస్తూ ఉంటాయి. మరి విటమిన్ బీ లు శరీరంలో ఏ ఏ అవయవాలకు పని చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విటమిన్ బి1: దీనినే థయమిన్ అని అంటారు. మన కణాలు ప్రాథమిక విధులకు, జీవక్రియల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే పోషకాలు శక్తిగా మారేందుకు ఇది అవసరం. మన శరీర జీవక్రియల్లో అత్యంత చురుకైన పాత్ర మెదడుది.
విటమిన్ బీ2: దీనిని రిబోఫ్లావిన్ అని అంటారు. మన కణాలకు ఇది సాయం చేసే ఎంజైమ్. అలాగే మన శరీరం, మెదడులో కీలక చర్యలకు సహాయకారిగా రిబోఫ్లావిన్ పనిచేస్తుంది.
విటమిన్ బీ3: దీన్ని నయసిన్ అని అంటారు. 400కు పైగా ఎంజైమ్ లతో కలసి శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్, ఫ్యాట్ తయారీలో పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్, శరీరంలో అధికంగా ఉన్న ఇన్ ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది.
విటమిన్ బీ5: దీనినే పాంటోథెనిక్ యాసిడ్ అని అంటారు. కోఎంజైమ్ ఏ అనే మాలిక్యులర్ కాంపౌండ్ తయారీకి అవసరం. శరీరంలో ఎంజైమ్ ల ఉత్పత్తి, కొవ్వులను విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చేందుకు అవసరం. మన మస్తిష్కం కూడా ఫ్యాట్ తోనే ఉంటుంది.
విటమిన్ బీ6: దీన్ని పైరిడాక్సిన్ అని అంటారు. వ్యాధి నిరోధకతలో దీని అవసరం ఎంతో ఉంది. కేన్సర్ల నిరోధకంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలీంది.
విటమిన్ బీ7: దీనినే బయోటిన్ అని అంటారు. శరీరమంతటికీ కణాల మధ్య సమాచారానికి ఇది చాలా అవసరం. న్యూరోట్రాన్స్ మీటర్ల ఆరోగ్యానికి కూడా ఇది అవసరం. శిరోజాల ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
విటమిన్ బీ9: దీనిని ఫొలేట్ అని అంటారు. మెదడు, నాడీ సంబంధిత ఆరోగ్యానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. కణాల్లోని వ్యర్థాల తొలగింపునకు ఉపయోగపడుతుంది.
Related News
Air Pollution: కాలుష్యం నుండి వచ్చే సమస్యలను తప్పించుకోవాలా.. అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి..!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) నానాటికీ పెరిగిపోతోంది. విషపూరితమైన గాలి ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.