HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Apricot Health Benefits And Uses

Jamun: నేరేడు పండుతో పొరపాటున కూడా వీటిని కలిపి అస్సలు తినవద్దు?

నేరేడు పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా కూడా

  • Author : Anshu Date : 22-06-2024 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Jun 2024 11 09 Am 621
Mixcollage 22 Jun 2024 11 09 Am 621

నేరేడు పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా కూడా మనకు నేరేడు పండ్లు ఎక్కువ మొత్తంలో లభిస్తూ ఉంటాయి. ఈ నేరేడు పండు మధుమేహం ఉన్న వారికీ ఎంతో మేలు చేస్తాయి. అయితే నేరేడు పండ్ల ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. నేరేడు పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నేరేడు పండ్లను కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు.

మరి నేరేడు పండ్లను వేటితో కలిపి తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నేరేడుతో పాటు పుచ్చకాయ, దోసకాయ కూడా ఆరోగ్యానికి మంచిది. ఇవి పలు వ్యాధుల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ఇవి సహాయపడతాయి. చాలా రుచిగా ఉండే ఈ పండు కోసం ఏడాది కాలం వేచి చూడాల్సిందే. అనేక ఔషధ గుణాలతో పాటు షుగరు, రక్తహీనత, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలను నియంత్రించడంతో సహాయపడతాయి.

నేరేడు పండు ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. నేరేడు పండుతో పాటు పసుపును కలిపి తీసుకోకూడదు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండు తిన్న వెంటనే పసుపు తీసుకోకూడదు. ఈ రెండూ కలవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఈ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల అంతరం ఉండాలి. నేరేడు పండు, పాలు కలిపి తీసుకోకూడదు. నేరేడుతో పాలు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. వాటిని ఒకేసారి తింటే జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా గ్యాస్ కూడా పెరుగుతుంది. కొంతమంది పచ్చళ్లు, నేరేడు పండు కలిపి తింటూ ఉంటారు.

కానీ ఇలా అస్సలు తినకండి. ఈ రెండింటి కలయిక విష ప్రభావానికి గురిచేస్తుంది. వీటిని కలిపి తింటే విరేచనాలు, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వస్తాయి. ఈ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల అంతరం ఉండాలి. అలాగే నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీని పెంచడంతో పాటు విరేచనాలను కలగజేస్తుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం మాత్రమే తీసుకోవాలి. శరీర ఉదర కుహరం, ఆహార పైపు, మెడను దెబ్బతీయడంతో పాటు కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Jamun
  • Jamun benefits
  • Jamun Fruit

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd