Beauty Tips: ముఖానికి ఇవి అప్లై చేస్తే చాలు.. రాత్రికి రాత్రే అందంగా మారిపోవడం ఖాయం!
మీ ముఖం రాత్రికి రాత్రి అందంగా మారిపోయి ఉదయానికల్లా మెరిసిపోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయేవి ముఖానికి అప్లై చేస్తే చాలు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:03 PM, Tue - 18 March 25

ప్రతి ఒక్కరూ అందమైన చర్మం కావాలని కోరుతూ ఉంటారు. కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో పురుషులు కూడా అందమైన చర్మం కోసం పరితపిస్తూ ఉన్నారు. అందమైన చర్మం కోసం మార్కెట్లో దొరికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్టులు ఉపయోగించడంతోపాటు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు రాత్రికి రాత్రి మెరిసిపోయి చర్మం మీ సొంతం అని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి నూనె కేవలం కురులకు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకటి రోజుల్లో కూడా కొబ్బరి నూనెను చర్మ సౌందర్యానికి ఉపయోగించేవారు. రాత్రి సమయంలో పడుకునే ముందు కొబ్బరినూనె ముఖానికి రాసుకొని పడుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే చర్మం ఎంతో గ్లోయింగ్ గా తయారవుతుందట.
అలోవెరా జెల్ కూడా చర్మానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా తరచుగా కలబంద జెల్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. చర్మం కూడా షైనీగా మెరుస్తుందట. ప్రతి రోజూ రాత్రి మీరు పడుకునే ముందు కలబంద గుజ్జు రాసి మర్దనా చేసి పడుకోవాలని,ఇలా చేస్తే కొన్నిరోజుల్లోనే మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
తేనె కూడా చర్మ సౌందర్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి న్యాచురల్ మార్చరైజర్ అని చెప్పవచ్చు. తేనె అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా మెరుస్తూ ఉంటుందట. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి తేనే అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకొని పడుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట.
రోజ్ వాటర్ కూడా ఎందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు రోజు వాటర్ అప్లై చేసుకుని పడుకొని మరుసటి రోజు శుభ్రం చేసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి తేడా కనిపిస్తుందట. అలాగే బాదం ఆయిల్ రాసుకున్న మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు..