Ajwain : పరగడపున వాముని తీసుకుంటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
Ajwain : ముఖ్యంగా, వాముని నీటిలో నానబెట్టి తాగడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది
- By Sudheer Published Date - 08:27 AM, Sun - 16 March 25

వాము (Ajwain ) అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలున్న ఒక రకం విత్తనం. ఇది మనం దైనందిన ఆహారంలో తరచుగా ఉపయోగించే పదార్థమయినప్పటికీ, ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. వాములో ఉండే శక్తివంతమైన ఔషధ గుణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే విధంగా పనిచేస్తాయి. అజీర్ణం, కడుపులో గ్యాస్, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. వాము తీసుకోవడం వల్ల పంటి నొప్పి, పీరియడ్స్ నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది శరీరంలో చక్కటి డిటాక్సిఫైయర్‌గా పనిచేసి, హానికరమైన టాక్సిన్లను తొలగించడానికి సహాయపడుతుంది.
Gastric Problem : గ్యాస్ట్రిక్ తో ఇబ్బందిపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి
వాము(Ajwain )ని పరగడపున తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా, వాముని నీటిలో నానబెట్టి తాగడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి, మెటబాలిజంను పెంచుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు వాము, తేనె, వెనిగర్ కలిపిన నీటిని 10 రోజుల పాటు ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. వాములో ఉండే శోథ నిరోధక గుణాలు మూత్రపిండాలకు రక్షణగా పని చేస్తాయి. అంతేకాకుండా, ఇది బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది. అయితే, వాముని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు.
DC vs MI WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతగా ముంబై ఇండియన్స్!
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వాము (Ajwain ) నీటిని అధికంగా తీసుకోవడం మంచిదికాదు, ఎందుకంటే ఇది గర్భస్రావానికి కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందికి వాములోని కొన్ని రసాయనాల కారణంగా చర్మంలోని అలర్జీ, దద్దుర్లు రావచ్చు. కావున, సరైన పరిమాణంలో మాత్రమే వామును తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో మితంగా వామును ఉపయోగించుకుంటే, ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.