ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. పోలీసులు తనిఖీ చేస్తూ ఛలానాలు విధిస్తున్నా, లైసెన్సులు రద్దు చేస్తాం అంటున్నా కొందరు ద్విచక్ర వాహనదారుల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. హెల్మెట్ ధరించని వాహనదారులకు విధించే ఛలానాను మార్చి 1వ తేదీ నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. అవసరమైతే లైసెన్సును కూడా రద్దు చేస్తారు.
హెల్మెంట్ వినియోగంపై కీలక తీర్పు ఇచ్చిన న్యాయస్థానం 👌👌👌 pic.twitter.com/eZvOiaVH2Z
— JSP Naresh (@JspBVMNaresh) March 5, 2025
దేశంలోని అన్ని నగరాల్లో 15 కి.మీ పరిధిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను వినియోగించాల్సిన అవసరం లేదంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా వినియోగదారుడు ఒకరు.. “హెల్మెట్ పై కీలక తీర్పు ఇచ్చిన న్యాయస్థానం 👌👌👌” అనే క్యాప్షన్ తో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో లో న్యూస్‌కు సంబంధించిన బ్రేకింగ్ అప్‌డేట్లను చూడొచ్చు. ‘‘దేశంలోని నగరాల పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించొచ్చు.సాగర్ కుమార్ జైన్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్(Fact Check) తనిఖీ ప్రక్రియను తిరస్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం. రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రోడ్లపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి. ఇకపై ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే.. మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది. నగరం వెలుపల 15 కిలోమీటర్లలోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగటానికి వీల్లేదు. ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి’’ అని బ్రేకింగ్ అప్‌డేట్‌లలో ప్రస్తావించారు.
ప్రచారం చేసిన వీడియోక్లిప్‌తో కూడిన స్క్రీన్ షాట్ ను ఈ కింద చూడొచ్చు.