HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Zodiac Sign Horoscope Doe This Week

Weekly Horoscope : తుల, మకర రాశుల వాళ్లకు ధన ప్రాప్తి యోగం.. ఈవారం మీ రాశిఫలం గురించి తెలుసుకోండి..!!

సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు తుల, మకర రాశుల వాళ్లకు ధన ప్రాప్తి యోగం పట్టనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

  • By hashtagu Published Date - 10:03 AM, Mon - 12 September 22
  • daily-hunt
Zodiac Signs
Zodiac Signs

సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు తుల, మకర రాశుల వాళ్లకు ధన ప్రాప్తి యోగం పట్టనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కన్య రాశి వాళ్ళ ఖర్చులు పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ వారంలో అన్ని రాశుల వాళ్లకు శుభ, అశుభ పరిణామాలు ఎదురవుతాయి. రండి.. ఈవారం మీ రాశిలో ఏం జరగబోతోందో తెలుసుకుందాం..

* మేషం 

వ్యాపార లావాదేవీలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులైనా అధిగమిస్తారు.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మరింత అనుకూలిస్తాయి. ఇతరుల సాయం లేకుండానే కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం చివరిలో అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

* వృషభం

విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.గతం నుంచి వేధిస్తున్న ఒక ప్రధాన సమస్య నుండి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులతో ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉండి లాభాలు గడిస్తారు. పారిశ్రామికవర్గాలకు  కష్టానికి ఫలితం కనిపించదు. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

* మిథునం

వ్యాపారాలు ఆశించినదాని కంటే అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు. పరిస్థితులను అనుకూలంగా చక్కబెడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కేచాన్స్‌. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువుల నుంచి సమస్యలు. నీలం, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

* కర్కాటకం

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.  వ్యాపారాలలో లాభాలు. కార్యజయం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఉద్యోగులకు పైస్థాయి వారి సహాయం అందుతుంది. వారం  ప్రారంభంలో ధనవ్యయం.  పసుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

* సింహం

ఖర్చులు అధికమై ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడచిపోతుంది. పట్టుదలతో ఏ కార్యక్రమాన్నైనా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు వ్యాపారాలు విస్తృతపరుస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

* కన్య

వాహనయోగం.వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు.
కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

* తుల

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. కళాకారుల యత్నాలలో కదలికలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

* వృశ్చికం

వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి.అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

* ధనుస్సు

వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు.
రాబడి ఆశాజకనంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

* మకరం

వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం.ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. గులాబీ, లేత ఎరుపు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

* కుంభం

వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. పనులలో అవాంతరాలు తొలగుతాయి.
.రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

* మీనం

వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. నలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • weekly horoscope

Related News

    Latest News

    • Karthika Maasam : కార్తీక మాసం – పౌర్ణమి కథ వింటే ఎంత పుణ్యమో.!

    • Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు.. అవి ఇవే!

    • Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

    • Tea Side Effects: టీ తాగేవారికి బిగ్ అల‌ర్ట్‌!

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    Trending News

      • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

      • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

      • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

      • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

      • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd