Ganesh: కలలో వినాయకుడు కనిపించాడా.. అయితే జరగబోయేది ఇదే?
మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు రావడం అన్నది సహజం. అయితే అందులో కొన్ని రకాల కలలు మాత్రమే మనకు గుర్తుంటాయి. అందులో కొ
- Author : Anshu
Date : 12-01-2024 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు రావడం అన్నది సహజం. అయితే అందులో కొన్ని రకాల కలలు మాత్రమే మనకు గుర్తుంటాయి. అందులో కొన్ని పీడకలలు కావచ్చు లేదంటే మంచి కలలు కూడా కావచ్చు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తుని సూచిస్తాయని చెబుతుంటారు. చాలా వరకు కలలో జరిగేవి నిజమవుతాయని కూడా చెబుతూ ఉంటారు. మామూలుగా మనకు కలలో దేవుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఒక్కో దేవుడు కనిపించినప్పుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సంకేతంగా భావించాలి. అయితే మీకు కలలో ఎప్పుడైనా విగ్నేశ్వరుడు కనిపించాడా.
ఒకవేళ అలా కనిపించి ఉంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు కలలో కనిపించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విగ్నేశ్వరుడు కలలో కనిపించడం అంటే అది ఎంతో శుభ పరిణామంగా పరిగణించాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడంటేనే విఘ్నాలను హరించేవాడని అర్థం. అంటే జీవితంలో వచ్చే అవరోధాలను అడ్డుకుని సాంత్వన కలిగిస్తాడని నమ్ముతారు. అందుకే ఏ పని ప్రారంభించేముందైన గణేశుడిని పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తే అందులో సమస్యలేమైనా ఎదురైనా తొలుగుతాయి. అంతేకాకుండా శుభం కలిగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దేవతలందరికంటే ముందు ఆది పూజ విఘ్నేశ్వరుడికే చేయాలి.
వినాయకుడు శుభానికి ప్రతిరూపం. అంతేకాకుండా ఎంతో మంచి చేస్తాడని నమ్మకం. మరి అలాంటి విగ్నేశ్వరుడు కలలో వస్తే ఆయను అనుగ్రహం పొందినట్లేనని సూచన. వినాయకుడిని సుఖార్త అని కూడా అంటారు. అంటే మంచి చేసేవాడు లేదా సుఖ-సంతోషాలను కలిగించేవాడని అర్థం. కాబట్టి ఆయన గురించి కలలు కన్నప్పుడు త్వరలో శుభవార్తలు వినబోతున్నారని తద్వారా ఆనందం పొందవచ్చని తెలుసుకోవాలి. కలలో గణేశుడు కనిపించాడంటే త్వరలో మీరు ఒక పనిని లేదా వ్యక్తిగత జీవితంలో నూతన ప్రారంభాన్ని ఆరంభించబోతున్నారని సూచిస్తుంది. అంతేకాకుండా గతంలో మీరైమైనా మొక్కులు మొక్కి తీర్చలేనప్పుడు వాటిని గుర్తు చేసేందుకు కూడా గణనాథుడు కలలో కనిపించవచ్చు. ఈ విధంగా కనిపించి ఆ మొక్కును ఆయన స్వరూపం ద్వారా గుర్తు చేసినట్లు అర్థం చేసుకోవాలి.