Spirituality: ధనవంతులు కావాలి అనుకుంటే ఇంట్లో ఈ విధంగా చేస్తే చాలు లక్ష్మీ ఇంట్లోకి రావడం ఖాయం!
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అనుకున్న వారు గురువారం రోజుకు కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:00 PM, Wed - 2 October 24

చాలామంది లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజిస్తూ ఉంటారు. కొందరు గురువారం పూజిస్తూ ఉంటారు. కాగా లక్ష్మీదేవికి వారంలో గురువారం అంటే చాలా ఇష్టం.. గురువారం రోజు లక్ష్మీదేవికి చేస్తే పూజలు ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగజేస్తాయని పండితులు చెబుతున్నారు. ఎంతటి దరిద్రంతో ఉన్నా సరే ఉప్పుతో ఇలా చేస్తే ధనవంతులుగా మారిపోతారట. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఇంట్లో ఇలా చేస్తే కష్టాల నుంచి బయటపడతారని చెబుతున్నారు. ధన సమస్యలు ఉన్నవారు ఈ విధంగా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు వున్నవారు గురువారం ఉదయం స్నానం చేసిన తరువాత పిడికెడు దొడ్డుప్పు తీసుకొని మీ ఇష్టదైవం ముందు నిలబడాలి.
ఉప్పును చేతిలో అలాగే పట్టుకొని మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మొక్కుకోవాలి. ఆ తరువాత ఉప్పును తీసి ప్రవహించే నీటిలో పడేయాలి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. మరో విధంగా కూడా చేయవచ్చు. గురువారం రోజు ఉప్పును ఒక పొట్లంతో లేదంటే ఒక కవర్‌లో తీసుకోవాలి. ఈ ఉప్పును కిటికీ దగ్గర పెట్టాలి, లేదంటే నీళ్లు పడని చోటులో పెట్టాలి. ఈ ఉప్పును నెలరోజుల తరువాత తీసి ప్రవహించే నీటిలో పడేయాలి. దొడ్డుప్పు లేకపోతే సాధారణ ఉప్పుతో అయినా చేసుకోవచ్చు. గురువారం రోజు సగం గ్లాసు నీళ్లల్లో మూడు చెంచాల ఉప్పును వేసుకోవాలి. ఈ గ్లాసును గుమ్మం పక్కన పెట్టాలి. తరువాత రోజు ఆ నీటిని తీసి షింక్‌లో పడేయాలి.
లేదంటే గురువారం రోజు ఒక చిన్న బౌల్లో ఉప్పును తీసుకొని ఆ ఉప్పులో మూడు లవంగాలు , మూడు మిరియాలు వేసి బెడ్‌రూంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల భార్యా భర్తల మధ్య వున్న గొడవలు తగ్గిపోతాయట. అలాగే ఇంట్లో వున్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందని మిరియాలను, లవంగాలను గాజు గిన్నెలో మాత్రమే వేయాలి. అల్మారా, టేబుల్ కింద ఈ గిన్నెను పెట్టవచ్చు. దీంతో మీకు వున్న అన్ని సమస్యలూ తొలగిపోతాయట. లక్ష్మీ దేవి ఫోటో తీసుకొని తుడచి బొట్లు పెట్టి ఫోటోను బాగా భక్తితో అలంకరించాలి. పువ్వులతో పసుపు, కుంకుమలతో అలంకరించాలి.
తరువాత 108 నాణేలను తీసుకొని ఒక్కో రూపాయి బిళ్లను అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి. ఇలా ప్రతీ రోజూ చేస్తూ వుంటే మీరు కచ్ఛితంగా కోటీశ్వరులు అవుతారట. అప్పులు వున్నా కొద్ది కొద్దిగా తీరిపోతూ వుంటాయని చెబుతున్నారు. ఈ పూజకు ఎలాంటి ఆహార నియమాలూ లేవు. పూజ చేసేటప్పుడు దుమ్మూ ధూలి లేకుండా చూసుకోవాలి. ఈ పూజలో వాడిన రూపాయి బిళ్లలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. 41 రోజుల వరకు ఈ పూజను చేయాలి. ఈ పూజలను రూపాయి బిల్లలతో కాకుండా పసుపు కొమ్మలు, తామర గింజలతో కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు.