Women Qualities : ఈ గుణాలున్న స్త్రీలు లక్ష్మీస్వరూపులు..వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. !!
స్త్రీ..లేకుండా విశ్వం లేదు.. !స్త్రీ లేని సృష్టిని ఊహించడం అసాధ్యం!! హిందూమతంలో స్త్రీలను దేవతలుగా చూస్తుంటారు!!!
- By hashtagu Published Date - 07:30 AM, Sun - 28 August 22
స్త్రీ..లేకుండా విశ్వం లేదు.. !స్త్రీ లేని సృష్టిని ఊహించడం అసాధ్యం!! హిందూమతంలో స్త్రీలను దేవతలుగా చూస్తుంటారు!!! సమాజాభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర!! స్త్రీల గొప్పతనం గురించి గ్రంధాల్లో పేర్కొన్నారు. అయితే ఈ నాలుగు గుణాలు ఉణ్న స్త్రీలు ఆదర్శ స్త్రీలుగా పరిగణించబడుతారు. లక్ష్మీదేవి స్వరూపులుగా నమ్ముతారు. శాస్త్రం ప్రకారం స్త్రీకి ఎలాంటి గుణాలు ఉండాలో తెలుసుకుందాం.
1. ఆధ్యాత్మిక చింతన:
శాస్త్రాల ప్రకారం, పవిత్రమైన స్త్రీ ఉన్న ఇంట్లో సంతోషం శ్రేయస్సు ఉంటుంది. ధర్మాన్ని అనుసరించే స్త్రీలకు మంచి చెడుల మధ్య తేడా ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఆమె కుటుంబానికే కాదు సమాజానికి కూడా సరైన మార్గాన్ని చూపుతుంది. ఒక మతపరమైన స్త్రీ తప్పు ఎలాంటి తప్పులు చేయకుండా కుటుంబాన్ని చక్కదిద్దుతూ సరైన మార్గంలో ఉండేలా చూసుకుంటుంది. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తున్నారని ఆమెకు తెలిస్తే, ఆ తప్పును సరిదిద్దడంలో ముందుంటుంది.
2. సంపద సంచితం:
సంపద పోగుచేసే గుణం ఉన్న స్త్రీలు తమ కుటుంబాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమస్యల్లోకి నెట్టేయరు. శాస్త్రాల ప్రకారం, డబ్బును ఎలా పొదుపు చేయాలో స్త్రీ తెలుసుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో, కుటుంబాన్ని బయటకు తీసుకురావడంలో ఈ డబ్బు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్త్రీకి డబ్బును ఎలా ఖర్చు చేయాలో బాగా తెలుసు. అనవసరపు ఖర్చు చేయరు. అలాంటి మహిళలు, భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో డబ్బును ఖర్చు చేస్తుంటారు.
3. ఆకట్టుకునే మాటలు:
మాటలు బంధాలను ఏర్పరుస్తాయి. అంతేకాదు అదే మాటలు బంధాలను విడదీస్తాయి కూడా. ఏదైనా ఒక్క చిన్న మాటలోనే ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, మధురమైన భాష మాట్లాడే స్త్రీ ఆ కుటుంబానికి అదృష్టంగా భావిస్తారు. మృదువుగా మాట్లాడే స్త్రీ ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటుంది. అలాంటి స్త్రీలు గౌరవానికి అర్హులు. తల్లి, అత్తగారి ప్రతిష్టను కాపాడుతుంటారు.
4. విద్యావంతులు, ధైర్యవంతులు:
చదువుకున్న స్త్రీ తననే కాదు మొత్తం సమాజాన్ని అభివృద్ధి చేస్తుంది. అలాంటి మహిళలు మొత్తం కుటుంబానికి స్ఫూర్తి. విద్య ధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యవంతురాలు కష్ట సమయాల్లో భయపడదు. ఆమె కష్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆదర్శ మహిళకు చదువు, ధైర్యం ఈ రెండూ ముఖ్యం.
శాస్త్రాల ప్రకారం, ఈ పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉన్న స్త్రీ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇలాంటి గుణాలున్న స్త్రీ ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు హరివిల్లుగా మారుతుంది.