Money Plant: వేరే వాళ్ళ ఇంటి నుంచి దొంగలించిన మనీ ప్లాంట్ నాటితే సంపద కలిసి వస్తుందా?
Money Plant: మనీ ప్లాంట్ మొక్కను వేరే వాళ్ళ ఇంటి నుంచి దొంగలించి నాటితే నిజంగానే సంపద కలిసి వస్తుందా. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sat - 8 November 25
Money Plant: చాలామంది ఇండ్లలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. కొందరు బయట లేదా ఆన్లైన్ లో కొనుగోలు చేసి నాటితే మరికొందరు వేరే వారి ఇంట్లో నుంచి చిన్న కొమ్మను దొంగలించి తెచ్చి ఇంట్లో నాటుతారు. ఇలా చేయడం వల్ల సంపద కలిసి వస్తుందని నమ్ముతారు. అయితే అది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో నాటితే ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతుందని చెబుతున్నారు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడని, ఆ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయని, ఆర్థిక లాభాలు వచ్చి పడతాయని అంటుటారు.
అయితే కొంతమంది ఈ మొక్కను వేరొకరి ఇంటి నుంచి వారికి తెలియకుండా కొమ్మని తెచ్చి ఇంట్లో నాటుతారు. దీన్ని దొంగతనమనే అంటారు. అలా చేస్తే పక్కింటి వారి సంపద తమకు వచ్చేస్తుందని వారు భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల ఎంతో మేలు జరుగుతుందట. అలాగే శుభాలు కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని అలాంటి వాటిలో మనీ ప్లాంట్ కూడా ఒకటి అని చెబుతున్నారు. ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుందట. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని, మనీ ప్లాంట్ నాటడం అనేది సంపదను, అదృష్టాన్ని, విజయాన్ని పొందేందుకు ఒక మార్గం అని చెబుతున్నారు.
మనీ ప్లాంట్ ను దొంగిలించి నాటడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయని నమ్మకం. కాగా మామూలుగా ఏ రూపంలోనైనా దొంగతనం చేయడం అశుభకరం. చట్ట విరుద్ధమైన మార్గాలలో నడవడం అనేది ఎప్పటికైనా సమస్యలను తెచ్చుతుందట. అలాగే మనీ ప్లాంట్ ను కూడా దొంగతనంగా పొందినప్పుడు అది మీకు ప్రతికూల శక్తిని అందిస్తుంది, తప్ప సానుకూల శక్తిని అందించదని చెబుతున్నారు. కాబట్టి మనీ ప్లాంట్ ను ఎవరి ఇంటి దగ్గర నుంచి వారి తెలియకుండా తీసుకోకూడదట. ఇది ఇంటి ఆనందానికి, శ్రేయస్సుకు సవాలుగా మారుతుందట. ఇంట్లో ఆర్థిక సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు. మనీ ప్లాంట్ ఇంట్లో నాటాలనుకుంటే దాన్ని కచ్చితంగా మీ డబ్బులతోనే కొని నాటాలట. అలా కొని నాటిన మనీ ప్లాంట్ అత్యంత శుభప్రదమైనదిగా చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, లక్ష్మీదేవి ఆశీస్సులు దక్కుతాయని చెబుతున్నారు.