Snake: పాములు చంపితే ఏం జరుగుతుంది.. ఆ పాపం పోవాలంటే ఇలా చేయాల్సిందే!
పాములను చంపిన వారు తప్పకుండా ఒక పూజ చేయించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Wed - 28 August 24

మామూలుగా మనం కొన్ని కొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా కానీ లేదంటే ప్రాణహాని ఉంది అనుకున్నప్పుడు పాములను చంపడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు పాములు కనిపిస్తే చాలు వాటిని చంపే వరకు వదిలిపెట్టరు. ఇంట్లోకి ఇంటి ఆవరణలోకి వచ్చినప్పుడు వాటిని చంపేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వాటి వల్ల ప్రాణహాని కలుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వాటిని చంపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇలా తెలిసి తెలియకో కొన్ని కొన్ని సార్లు మనం పాములను చంపుతూ ఉంటాం. పాములను చంపడం వల్ల సర్ప దోషం అంటుకుంటుంది. ఈ సర్ప దోషాలు ఏడు తరాలను పట్టిపీడిస్తుందని చెబుతూ ఉంటారు.
మరి ఇలా పాములను చంపిన వారు ఆ పాపాలను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాములు సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే సర్ప సంస్కార పూజ చేయాలని చెబుతున్నారు. ఈ పూజ నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే అత్యంత శక్తివంతమైన పూజ. పాములను చంపిన వారు మాత్రమే కాదు, పాములను కొట్టేవారు, బంధించేవారు, వాటిని హింసించేవారు కూడా చేయించుకోవాలట. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా సర్ప సంస్కార పూజ నిర్వహిస్తే మంచిదని చెబుతున్నారు. మరి సర్ప సంస్కార పూజ ఎలా చేస్తారు? అన్న విషయానికి వస్తే..
ఒక జీవిని చంపిన వారు దాని నుంచి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే భవిష్యత్తులో మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉండడం మంచిది. మరో ప్రాయశ్చిత్తం సర్ప సంస్కార పూజ. దీనిని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో, ప్రసన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేస్తారు. ఒక మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో అలానే మీరు చంపిన పాములకు కూడా అంతిమ సంస్కారాలు చేయిస్తారు. దర్భలు కానీ వేరే పదార్థాలతో కానీ సర్పాన్ని తయారు చేసి ఈ సంస్కారాన్ని చేయిస్తారు పూజారులు.
ఇది పాటించిన తర్వాత కొన్ని రోజులు అసౌచాన్ని పాటించాలి. ఎందుకు, ఏంటి, ఎన్నిరోజులు అసౌచాన్ని పాటించాలన్నది అక్కడ మీతో పూజ చేయించిన వారు వివరిస్తారు. అయితే సర్ప సంస్కార పూజా వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే.. నాగదోష సంహారం నుంచి ఉపశమనం పొందవచ్చట. అలాగే కెరియర్ లో వృద్ధి ఉంటుందట. సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయట. అలాగే మీరు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.