Sriramanavami : శ్రీరామ నవమి రోజునే రాముని కళ్యాణం ఎందుకు చేస్తారు ?
Sriramanavami : చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, అభిజిత్ ముహూర్తంలో భగవాన్ శ్రీరాముడు అవతరించారు
- By Sudheer Published Date - 09:53 AM, Sun - 6 April 25

శ్రీరామనవమి (Sriramanavami ) అనేది భక్తుల జీవితాల్లో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, అభిజిత్ ముహూర్తంలో భగవాన్ శ్రీరాముడు అవతరించారు. ఈ ప్రత్యేక సమయానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ ధర్మంలో, అవతార పురుషుల జన్మదినానే వారి విశేష సంఘటనల్ని నిర్వహించడం శ్రేష్ఠమైనదిగా భావించబడుతుంది.
IPL 2025 : SRH మళ్లీ ఫామ్లోకి వస్తుందా?
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. శ్రీరాముడి వివాహం వైశాఖ శుద్ధ దశమి రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగింది. అయినా సరే, భగవంతుడి జన్మతిథినే కల్యాణానికి ఎన్నుకోవాలన్నది ఆగమ, శాస్త్ర సంప్రదాయం. ఈ నియమం ప్రకారమే శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఇది ఒక విశేషమైన ఉత్సవంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. దేవాలయాల్లో, పూజా మందిరాల్లో శ్రద్ధాభక్తులతో కళ్యాణం నిర్వహించి, ప్రజలందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు.
Sriramanavami Effect : నేడు వైన్ షాపులు బంద్
అంతే కాదు సీతా రాముల పట్టాభిషేకం కూడా శ్రీరామనవమి రోజున జరిగినట్లు పురాణ గాథలు పేర్కొంటున్నాయి. ఇది రాముని జీవితంలో ఓ ఘనమైన ఘట్టం. అందువల్ల ఈ రోజున రాముడు జన్మించాడని మాత్రమే కాక, ఆయన కళ్యాణం, పట్టాభిషేకం జరిగాయని విశ్వాసం ఉంది. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని జరపడం ద్వారా భక్తులు మహాపుణ్యాన్ని అందుకుంటారని నమ్మకం.