Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?
Ganesh Nimajjanam : భక్తితో గరికను సమర్పించినా విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని వినాయకుడు అభయమిస్తాడు.
- By Pasha Published Date - 08:14 AM, Wed - 27 September 23
Ganesh Nimajjanam : భక్తితో గరికను సమర్పించినా విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని వినాయకుడు అభయమిస్తాడు. అలాంటి గణేశుడిని రకరకాల ఆకృతులలో.. భారీ మండపాలు వేదికగా నవరాత్రులు పూజిస్తుంటారు. వినాయక నవరాత్రుల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది..? అంటే.. 1892 నుంచి !! వినాయక చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని మహారాష్ట్రకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ఆనాడు తొలిసారిగా పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన నిర్దేశించారు. బ్రిటీష్ పాలకులు విధించిన ఆంక్షల కారణంగా హిందువులు ఒకచోట కలిసే అవకాశం అప్పట్లో లేకుండా పోయింది. దీన్ని గమనించిన బాలగంగాధర్ తిలక్.. వినాయక చవితి నవరాత్రులు వేదికగా హిందూలోకాన్ని ఏకం చేసే ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
Also read : Petrol- Diesel: హైదరాబాద్, విజయవాడల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
నిమజ్జనం తప్పనిసరి.. ఎందుకంటే ?
భూదేవికి మనసారా నమస్కరించి భక్తితో మట్టిని తీసుకుని గణపతి ప్రతిమను తయారు చేయాలి. గణపతి ప్రతిమలను తయారు చేయడానికి వానాకాలం మొదలవడానికి ముందే.. చెరువులు, కుంటల నుంచి మట్టిని తీస్తే వాటి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అనంతరం వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి వీలును బట్టి 3, 5, 7, 9, 11, 21 రోజుల పాటు పూజలు చేసి గంగమ్మ ఒడికి చేరుస్తారు. భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. గణపతి జలరూపానికి ప్రతినిధి.. కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది విశ్వాసం. కొందరు తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న వినాయక ప్రతిమలకు ఉద్వాసన చెప్పి.. నిమజ్జనం చేయకుండా వదిలేస్తారు. విగ్రహాలు ఒకవేళ ఇంట్లోనే ఉంటే వాటి సైజుకు తగినంత రేంజ్ లో ప్రతి రోజూ నైవేద్యం సమర్పించాలని (Ganesh Nimajjanam) గుర్తుంచుకోవాలి.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
Related News
Ganesh Immersion : గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
Ganesh Immersion : సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ మధ్య జరిగే గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.