HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why Do We See Shiva Linga Through Nandi Horns

Lord Shiva: నందికొమ్ముల నుంచే శివున్ని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా..?

హిందువులు సాధారణంగా ఏ దేవున్ని అయినా సరే...నేరుగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రమే దైవదర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నందికొమ్ముల నుంచి చూస్తూ దైవదర్శనం చేసుకుంటారు.

  • Author : hashtagu Date : 14-07-2022 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Shiva
Lord Shiva

హిందువులు సాధారణంగా ఏ దేవున్ని అయినా సరే…నేరుగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రమే దైవదర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నందికొమ్ముల నుంచి చూస్తూ దైవదర్శనం చేసుకుంటారు. ఆ తర్వాతే ఆలయంలోకి వెళ్లి శివున్ని దర్శించుకుంటారు. అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నందికొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి. నేరుగా వెళ్లి లింగాన్ని దర్శించుకుంటే ఏమైతుంది. అలా ఎందుకు చేయకూడదు. తెలుసుకుందాం.

శివుడు త్రిమూర్తులలో ఒకరు. కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు. శివున్ని లింగరూపంలో దర్శించుకోవాలి. శివుడు లయకారకుడు. మూడో కన్ను తేరిచినట్లయితే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అవుతుంది. అంతటి శక్తి శివుని మూడోకన్నుకు ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోవద్దు. ముందుగా నందికొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతేకానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. అలా వెళ్తే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.

నందికొమ్ముల నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నందివీపుపై నిమురుతూ మన కుడి చేతితో నందిచెవినిమూయాలి. తర్వాత మన మనస్సులో ఉన్న కోరికతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి. అలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాసా ప్రాప్తి కూడా కలుగుతుందట. మరో జన్మ కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lord Shiva
  • nandi horns

Related News

Mahashivratri 2026

మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని అర్చించడం అత్యుత్తమమని శివ మహాపురాణం చెబుతోంది. ఈ పురాణం ప్రకారం.. ఎవరైతే పార్థివ శివలింగాన్ని పూజిస్తారో వారు ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతాన సౌఖ్యాన్ని పొందుతారు.

  • Mahashivratri

    రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

Latest News

  • బ్రతికుండగానే సమాధి కట్టుకున్న వృద్ధుడి ప్రేమగాథ

  • డంపింగ్ యార్డులో మదనపల్లె కులవర్ధన్ అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు రాని కుటుంబ సభ్యులు

  • Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

  • AP Assembly : హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలు

  • ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్‌ కి ఏడు ఒప్పందాలు

Trending News

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd