God Worship: దేవుడికి పూజ చేస్తున్నప్పుడు చెడు ఆలోచనలు రావడం మంచిది కాదా?
మీకు కూడా దేవుడికి పూజ చేస్తున్న సమయంలో అనవసరపు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా, ఇలా వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:01 PM, Mon - 17 February 25

దేవుడికి పూజ చేసినప్పుడు ప్రశాంతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మనసును దేవుడు పై లగ్నం చేసి పూజ చేయాలని చెబుతూ ఉంటారు. అలాగే మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకూడదని చెబుతుంటారు. కొన్నిసార్లు ఎంత ఆలోచించకుండా చేయాలి అనుకున్నప్పటికీ మైండ్ లోకి చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వేరే ఇతర ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. గుడికి వెళ్తే బయట విప్పిన చెప్పులు ఉన్నాయో లేదో అని ఆలోచించేవారు కొందరైతే, ఏదైనా సినిమా గురించో, ఇంకేవో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి.
కొందరికైతే ఏకంగా శృంగార సంబంధిత ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా దేవుడికి పూజ చేస్తున్న సమయంలో, దేవుడిని గుడిలో దర్శించుకుంటున్న సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమౌతుంది? పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ సమయంలో మీ మనస్సులో అకస్మాత్తుగా ఏదైనా శృంగార ఆలోచనలు వస్తే మీ మనసు, శరీరం రెండూ స్వచ్ఛమైనవి కాదు అని అర్థమని చెబుతున్నారు. వాస్తవానికి శృంగార ఆలోచనలు రావడం తప్పు కాదు. ఈ భావన వివాహికక జీవితంలో ఒక అంతర్భాగం. కానీ కామ వాంఛ మనస్సులో బాగా పెరిగిపోయి ఆఖరికి పూజ సమయంలో కూడా రావడం మంచిది కాదట.
అది కూడా పరాయి వ్యక్తి పై ఇలాంట ఆలోచనలు రావడం మరింత తప్పు అని చెబుతున్నారు. మీ భాగస్వామిపై అలాంటి ఆలోచనలు వస్తే అందులో ఎలాంటి తప్పు లేదు. పూజ సమయంలో మనస్సులో కోపం లేదా అసూయ లాంటివి రావడం మొదలైతే ఇది కూడా సరైనది కాదని చెబుతున్నారు. పూజ సమయంలో కోపం కూడా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు మీరు దేవునిపై కోపంగా ఉంటే, అది మీ భక్తి ,విశ్వాసం పిలుపు రూపంలో ఉంటుందట. మరోవైపు, ప్రార్థన చేస్తున్నప్పుడు, కోపం, అసూయ లేదా వేరొకరి పట్ల ప్రతికూల ఆలోచనలు అనుభూతి చెందడం దేవుని నుండి మీకు దూరాన్ని సూచిస్తుందట. దేవుడు మీ చెడు పనుల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ చెడు పనులను, ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోవాలని చెబుతున్నారు.