Coconut: కొబ్బరికాయ కొట్టడంలో పాటించాల్సిన నియమాలు విధివిధానాలు ఇవే?
భారతదేశంలో హిందువులు ఎటువంటి పని మొదలుపెట్టిన కూడా కొబ్బరికాయ కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పూజ
- By Nakshatra Published Date - 06:00 AM, Thu - 1 December 22
భారతదేశంలో హిందువులు ఎటువంటి పని మొదలుపెట్టిన కూడా కొబ్బరికాయ కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి పూజను ముగిస్తూ ఉంటారు. అయితే టెంకాయ కొట్టడంలో కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం. అరిష్ట నాశకం. భగవంతుడికి కొబ్బరికాయను కొట్టే ముందు దానిని మంచి నీటితో కడగాలి. ఆ తర్వాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని పట్టుకొని దేవుడిని స్మరించుకొని టెంకాయను కొట్టాలి. అయితే టెంకాయ కొట్టేటప్పుడు కింద రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.
కొబ్బరికాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది. అలాగే చాలామంది టెంకాయను కొట్టినప్పుడు రెండు భాగాలుగా పగలాలి అని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది లోపల టెంకాయ నల్లగా దానిని అశుభంగా భావిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో సర్వం సర్వేశ్వరార్పితం అని భావంచి పరమాత్మున్ని 108 సార్లు జపిస్తే సరిపోతుంది. అలాగే చాలామంది టెంకాయని విడదీయకుండా చేత్తో పట్టుకొని అభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయడం తప్పు. అలా చేస్తే ఆ టెంకాయ నైవేద్యానికి పనికిరాదు.
కొబ్బరి కాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని,కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటిని మాత్రమే అభిషేకం చేయాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొబ్బరికాయ కొట్టిన తరవాత రెండు ముక్కలకు కుంకుమ ,పసుపు లాంటివి బొట్లు పెట్టవద్దు. అలా పెడితే విరుద్ధ పూజ అవుతుంది. అదేవిధంగా కొబ్బరికాయను కొట్టిన తరువాత స్వామి వారికి నివేదన చేసిన తరువాత ప్రసాదాన్ని భక్తులకు పంచాలి. అప్పుడే పూజ ఫలితం దక్కుతుంది పుణ్యం కూడా లభిస్తుంది. కొబ్బరికాయ పట్టుకుని దేవుడికి మొక్కేప్పుడు జుట్టు దేవుని వైపు పెట్టి మొక్కుకోవాలి , కొట్టేప్పుడు మాత్రం జుట్టు మనవైపు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన తరవాత అది అడ్డం , నిలువు, తోట్లే మాదిరిగా ఏ విధంగా పగిలినా ఎలాంటి సందేహాలు అనుమానాలు పడవద్దు.
Tags
Related News
Summer: సమ్మర్ లో అలసటకు గురవుతున్నారా.. కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా జోష్
Summer: కొబ్బరి నీళ్లలో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా.. అలసట, బలహీనతను తొలగిస్తుంది. దాంతోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచుతుంది. అయితే ఎండకాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లలో తక