Rudraksha Remedy: పెళ్లి కావడం లేదని దిగులు చెందుతున్నారా.. అయితే ఈ రుద్రాక్షలను ధరించాల్సిందే?
వయసు వచ్చినా కూడా పెళ్లి కాకుండా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు కెరియర్ డబ్బు సంపాదన అంటూ ఆ లోకంలో బ్రతిక
- By Nakshatra Published Date - 04:35 PM, Tue - 19 December 23
వయసు వచ్చినా కూడా పెళ్లి కాకుండా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు కెరియర్ డబ్బు సంపాదన అంటూ ఆ లోకంలో బ్రతికి ఒక్కసారిగా వయసు అయిపోయేసరికి పెళ్లి కాక చాలామంది ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే కొంతమందికి చిన్న వయసులో ఉన్నా కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల పెళ్లి కావడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. కొంతమందికి పెళ్లి అయినా కూడా వైవాహిక జీవితం ఆనందంగా ఉండదు. సరైన ముహూర్తం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటూ భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కారణాలన్నీ కాకుండా వైవాహిక సమస్యలకు అనేక జ్యోతిష్య కారణాలు ఉన్నాయి.
వేద జ్యోతిషశాస్త్రంలో ముందస్తు వివాహం కోసం అనేక నివారణలు సూచించారు. అయితే పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే రుద్రాక్ష ధరిస్తే చాలు కొద్ది రోజుల్లోనే పెళ్లి ఫిక్స్ అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు.. ఇంతకీ ఆ రుద్రాక్ష ఏంటో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.. ఒక అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో గురు గ్రహం అనుకూలత వివాహానికి చాలా అవసరం. అలాగే శని గ్రహానికి గురుగ్రహ ప్రభావం ఉండకూడదు. శని గ్రహం, దశ-మహాదశ, అంతర్దశ, సప్తమ శని, శని అంగారక దోషాల కారణంగా వివాహం సకాలంలో జరగదు.
శివుని ప్రతిరూపమైన రుద్రాక్ష ఆనందంతో అదృష్టాన్ని తెస్తుంది.
ముందస్తు వివాహానికి మార్గం సుగమం చేస్తుంది. కానీ దానిని ధరించడానికి సరైన సమయం, విధానం ఉంది. రుద్రాక్షలు 1 నుంచి 21 ముఖాల వరకు లభిస్తాయి. అయితే వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి కొన్ని రుద్రాక్షలు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయి. గౌరీ శంకర రుద్రాక్షను.. శివ పార్వతుల ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఈ రుద్రాక్ష వివాహంలో ఆనందానికి మూలం. దీనిని ధరించడం వలన అడ్డంకులు, గ్రహ దోషాలు తొలగిపోయి త్వరగా వివాహానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ రుద్రాక్ష పొందడం చాలా కష్టం..రెండు ముఖాల రుద్రాక్షలు అవివాహితులకు వరం. ద్విముఖ రుద్రాక్షను ధరిస్తే వివాహ సంబంధమైన ఆటంకాలను అధిగమించవచ్చు. ఇది ముందస్తు వివాహ అవకాశాలను పెంచుతుంది.
ఈ రుద్రాక్ష ధారణతో వైవాహిక జీవితంలో ఆనందం, అదృష్టం, సంపదతో పాటు శాంతిని ఇస్తుంది. నాలుగు ముఖాల రుద్రాక్ష వివాహంలో అడ్డంకులను తొలగిస్తుంది. ఇది ఒక వ్యక్తి తెలివితేటలను, ఏకాగ్రతను పెంచుతుంది. జాతకంలో గ్రహాల అననుకూలతల కారణంగా వివాహం ఆలస్యమవుతుంటే చతుర్ముఖ రుద్రాక్ష ధరించడం వల్ల ఆయా గ్రహాలకు శాంతి కలుగుతుంది..ఆరు ముఖాల రుద్రాక్ష సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ రుద్రాక్ష త్వరగా పెళ్లి జరగడానికి వీలు కలిగిస్తుంది. అంతేకాకుండా వివాహ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారికి, వైవాహిక బంధం విచ్ఛిన్నం అంచున ఉన్న జంటలు షణ్ముఖ రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Related News
Chanakya Niti: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ? జీవిత భాగస్వామికి ఏ ఏ లక్షణాలు ఉండాలో తెలుసా?
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. స్త్రీ అయినా, పురుషుడు అయిన వారి జీవిత భాగస్వామిని సరిగ్గా ఎంచుకోకపోతే మిగిలిన జీవితం మొత్తం అష్ట కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది.