Thumba Flower: పరమేశ్వరుడికి ఇష్టమైన పువ్వులు.. వీటితో పూజిస్తే చాలు.. డబ్బులే డబ్బులు!
పరమేశ్వరుడికి ఇష్టమైన పువ్వులు ఏవి? ఏ పువ్వులతో పూజిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:32 AM, Thu - 3 April 25

హిందువులు అంత్యత భక్తి శ్రద్ధలతో పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు. శివయ్యను ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పూజిస్తూ ఉంటారు. భక్తులు పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. కేవలం నీళ్లతో అభిషేకించినా కరిగిపోయే మనసున్నవాడు. కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లలో అందరికంటే ముందుంటాడు. కొన్ని నీళ్లు సమర్పించి శివయ్యా అంటూ ఆయనను తలచుకుంటే చాలు కోరిక కోరికలు తీరుస్తాడు. కాగా పరమేశ్వరుడి పూజలో రక రకాల పువ్వులు గుర్తుకు వస్తూ ఉంటాయి. పరమశివుడి పూజ అనగానే బిల్వ దళం గుర్తొస్తుంది.
లేదంటే జిల్లేడు పూలతో అభిషేకం జరిపిస్తుంటాం. అయితే ఆయనకు అన్నింటికీ మించి తుమ్మి పువ్వులు అంటే ఎంతో ఇష్టమట. శివుడికి ఇష్టమైన విష్ణువుకు సైతం తుమ్మి పువ్వులు ఎంతో ఇష్టమని ఈ పూలతో పూజ చేస్తే సర్వ సంపదలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని సమర్పించినా అంత ఫలితం ఉంటుందట. అదే విధంగా వెయ్యి గన్నేరు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి అభిషేకిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఒక్క మారేడు దళంతో అంతే ఫలితం ఉంటుందట.
శివలింగంపైన ఒక బిల్వపత్రాన్ని పెడితే మూడు జన్మల పాపాలను హరించివేస్తాడట. ఇక వెయ్యి బిల్వదలాలకు మించిన ఫలితం ఒక్క తామరపువ్వు ఇస్తుందని, వెయ్యి తామర పువ్వుల ఫలితం ఒక్క ఉమ్మెత్తపువ్వు అందిస్తుందట. ఇక వెయ్యి ఉమ్మెత్త పువ్వులను తీసుకొచ్చి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం ఒక్క జమ్మిపువ్వు ఇస్తుందట. చివరగా వెయ్యి జమ్మి పువ్వుల ఫలితం ఒక్క తుమ్మి పువ్వు పెడితే వస్తుందని చెప్తున్నారు. మారేడు దళాలకు మించి తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం అని చెబుతున్నారు.