Vinayaka Chavithi: వినాయక చవితి రోజు ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదు తెలుసా?
వినాయక చవితి రోజు చేయాల్సినవి చేయకూడని పనుల గురించి వివరించారు పండితులు.
- By Nakshatra Published Date - 10:30 AM, Thu - 5 September 24
ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద పెద్ద భారీ గణనాథుల విగ్రహాలను ఏర్పాటు చేసి మూడు రోజుల నుంచి 11 రోజుల వరకు ప్రత్యేకంగా పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున వినాయక చవితి జరుపుకోనున్నారు. వినాయక చవితికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాటు నిమగ్నం అయిపోయారు. ఇది ఇలా ఉంటే చాలామంది వినాయకుడి పూజ చేసేటప్పుడు అలాగే వినాయక చవితి రోజు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు.
కానీ వినాయక చవితి రోజు కొన్ని రకాల పనులు చేయాలి. కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతున్నారు పండితులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెప్టెంబర్ 7న వినాయక చవితి పూజ, విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన సమయం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన వినాయకుడి ఆరాధన, విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం 2 గంటల 31 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు గణపతిని పూజించవచ్చు. ఇకపోతే వినాయక చవితి రోజున చేయాల్సిన పనుల విషయానికి వస్తే..
ఇంట్లో లేదా పూజా స్థలంలో అందమైన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, వినాయకుడిని అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. వినాయక చవితి రోజున ఆచారాల ప్రకారం గణేశుడిని ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్టించాలి.
ఈ దిశలో వినాయకుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే గణపతి బప్పాను ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్టించి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేయాలి. పూజలో ఎరుపు రంగు దుస్తులను ఉపయోగించాలి. గణపతి పూజలో ఎరుపు రంగు పూలు, పండ్లు, ఎర్ర చందనం ఉపయోగించడం మంచిది. గణేశుని ఆరాధనలో దర్భ గడ్డి, పూలు, పండ్లు, దీపాలు, అగరుబత్తీలు, గంధం, కుంకుమ వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, మోదకాలు సమర్పించాలి. గణపతికి పూజ చేసేటప్పుడు “ఓం గం గణపతయే నమః” వంటి మంత్రాన్ని జపించాలి. ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. గణేష్ చతుర్థి రోజున ఇంట్లో పొరపాటున కూడా సగం నిర్మించిన లేదా విరిగిన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం లేదంటే పూజించడం లాంటివి అస్సలు చేయకూడదు.
అలా చేయడం అశుభంగా భావిస్తారు. అలాగే గణపతి పూజలో పొరపాటున కూడా తులసి దళాన్ని, మొగలి పువ్వులను ఉపయోగించకూడదు. విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వల్ల పూజల ఫలితాలు రావు. గణేష్ చతుర్థి రోజున ఉపవాసం, పూజలు చేసే వ్యక్తి శరీరం, మనస్సులో స్వచ్ఛంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. గణేష్ చతుర్థి రోజుల్లో పొరపాటున కూడా తామసిక వస్తువులు తినకూడదట. అలాగే గణేష్ చతుర్థి పండుగ రోజు కుటుంబ సభ్యులతో గొడవ పడకూడదు. కోపం తెచ్చుకోకూడదు.
Related News
Vinayaka Chavithi: ఐదవరోజు గణేష్ నిమజ్జనం చేస్తున్నారా.. అయితే శుభ సమయం ఇదే!
ఐదవరోజు గణేష్ నిమజ్జనం చేసే వారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలట.