Dreams: అలాంటి కలలు వస్తున్నాయా.. మరణానికి సంకేతం?
మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని మంచి కలలు అయితే కొన్ని భయంకరమైన కలలు కూడా వస్తుంటాయి. మనం రాత్రిపూట వచ్చి
- By Anshu Published Date - 06:15 PM, Wed - 10 May 23

మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని మంచి కలలు అయితే కొన్ని భయంకరమైన కలలు కూడా వస్తుంటాయి. మనం రాత్రిపూట వచ్చిన చాలా కలలు సరిగా గుర్తుండవు. కేవలం కొన్ని రకాల కళ్ళల్లో మాత్రమే గుర్తుంటాయి. అయితే అందులో కొన్ని కలలు మరణానికి సంకేతం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. మరి ఆ కలలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అప్పుడప్పుడు జీవితంలో మనకు జరగబోయే కొన్ని సంఘటనలను కలల రూపంలో సంకేతాలను ఇస్తూ ఉంటాయి.
అందులో కొన్ని మంచి శకునాలు అయితే కొన్ని చెడ్డ శకునాలు.. కలలో శరీరం పై గడ్డి లేదా చెట్టు పెరిగినట్టు కనిపిస్తే, కలలో మనకు మనం గుండుతో లేదా చిరిగిన కనిపిస్తే లేదా ఎత్తు నుంచి పడిపోతున్నట్టు కలలు వస్తే అది జరగబోయే చెడుకు సంకేతంగా అపశకునంగా భావించాలి.ఒక మంచి కల తర్వాత చెడు కల వస్తే చెడు కల నిజమవుతుంది. కనుక మంచి కల వచ్చిన తర్వాత మెలకువ వస్తే ఇక నిద్రపోకూడదని అంటుంటారు. అలాగే కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపించడం లేదా వివాహానికి హాజరవ్వడం, సంగీతం వినడం లేదా పాడడం వంటివి త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతోంది అనడానికి సంకేతం.
కలలో వివాహం, పాట పాడడం, పాములను, చండాలులను చంపుతున్నట్టు వచ్చే కలలు మంచివి కాదు అని శాస్త్రం చెబుతోంది. ఒంటె, గేదే, కంచర గాడిద మీద దక్షిణదిశగా ప్రయాణిస్తున్నట్టు కల వస్తే వారంలో వారు చనిపోవచ్చు.తైలాభిషేకం కలలో కనిపిస్తే వారంలో వారికి మృత్యువు తప్పదు.పక్షి మాంసం తింటున్నట్టు లేదా తేనె తాగుతున్నట్టు కల వచ్చినా మంచిది కాదు. ఇలాంటి కలలు దేవతలు, బ్రాహ్మణలు, రాజు లేదా గురువు మీ మీద కోపంగా ఉన్నారనడానికి సంకేతాలు.కలలు అపశకునాలు ఎదురైతే వీటికి పరిహారాలను తెలుసుకోవాలి.
వీటి నివారణ కోసం యజ్ఞాలు చెయ్యాల్సి రావచ్చు. ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే విష్ణువు, శివుడు, గణేషుడు, సూర్యుని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. నిద్ర పోయిన తర్వాత రెండవ భాగంలో వచ్చే కలలు ఆరునెలల్లో, తెల్లవారు జామున వచ్చే కలలు పది పదిహేను రోజుల్లో ఫలితాలను ఇస్తాయని అంటారు. కలలో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తే అది త్వరలో కలిగే సంపద నష్టాన్ని సూచిస్తుంది. కోపంతో తిడుతున్న లేదా కోపిష్టి బ్రాహ్మడు కలలో కనిపిస్తే తీవ్ర ప్రమాదపు అంచున ఉన్నట్టు అర్థం. గేదేలు, గాడిద, ఎలుగుబండి, ఒంటెలు తరుముతుంటే ఆ వ్యక్తి త్వరలో అనారోగ్యం బారిన పడతాడనడానికి సంకేతం. అవి మరణాన్ని సూచిస్తాయి. చంద్ర లేదా సూర్య గ్రహణం కలలో కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో మరణిస్తాడని అర్థం.