Narasimha Saligrama : నరసింహ సాలగ్రామ ప్రత్యేకత ఏంటి..? వారానికి ఎన్నిసార్లు అభిషేకం నిర్వహించాలి..!!
సాలగ్రామ...అంటే దైవానికి ప్రతీకలు. సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజసిద్ధంగా ఏర్పాడ్డాయి. నేపాల్లో గండికీ నదిలో ఈ సాలగ్రామలు లభిస్తాయి.
- By hashtagu Published Date - 08:00 AM, Fri - 10 June 22
సాలగ్రామ…అంటే దైవానికి ప్రతీకలు. సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజసిద్ధంగా ఏర్పాడ్డాయి. నేపాల్లో గండికీ నదిలో ఈ సాలగ్రామలు లభిస్తాయి.వీటిని విష్ణుమూర్తిగా భావిస్తారు. వీటిలో నరసింహ సాలగ్రామం చాలా ప్రత్యేకమైంది. సాలగ్రామలన్నింటిలో పరిమాణంలో ఇవి చాలా పెద్దగా ఉంటాయి.వీటిని ఆరాధించేవాళ్లకు శత్రువులను నుంచి రక్షణ లభిస్తుంది. దుష్టశక్తులు కూడా దూరంగా ఉంటాయని నమ్ముతుంటారు. సర్వకార్యాల్లో విజయం, అపారమైన సంపద, మంచి ఆరోగ్యం కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. సాలగ్రామ పూజతో భక్తి మార్గాన్ని, ధర్మమార్గాన్ని తప్పకుండా ఉంటారు. కాగా ఆధ్యాత్మిక ఉన్నతికి నరసింహ సాలగ్రామ అర్చన అనేది మార్గంగా చెబుతుంటారు.
నరసింహ సాలగ్రామ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మృదువుగా, పరిపూర్ణమైన రూపంతో కనిపిస్తుంది. సాలగ్రామాన్ని నీళ్లు, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, వీలునుబట్టి పండ్లరసంతో అభిషేకించాలి. వారానికి ఒకసారి గానీ, రెండు సార్లు గానీ శాస్త్రోక్తంగా అభిషేకం చేయాలి. అభిషేకం తర్వాత చందనం, తులసి దళాలు, ధూపం, దీపం, నైవేద్యం ఇలా షోడశ ఉపచారాలతో మూలమంత్రం జపిస్తూ పూజను నిర్వహించాలి.
కపిల నరసింహ:
మూడు లేదా ఐదు బిందువులు ఉంటాయి. మధ్యలో రెండు పెద్ద చక్రాలు, రేఖలు, పెద్ద ముఖంలో దంతాలతో ఉన్నట్టుగా ఈ సాలగ్రామ కనిపిస్తుంది. వృత్తాకారంలో లాక్షా వర్ణంలో ఉంటుంది. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పూజించడం వల్ల యుద్ధంలో విజయం, కోరికలు తీరడం, పాపాల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుంది.అంతేకాదు నియమాలు ఉల్లంఘిస్తే బాధలు, సమస్యలు ఎదురవుతాయి.
లక్ష్మీనరసింహ:
ఈసాలగ్రామ పెద్దముఖం ఉంటుంది. ఎడమవైపు రెండు చక్రాలు..మూడు లేదా ఐదు బిందువులు, వనమాల కలిగి ఉంటుంది. దీనిని ఆరాధిస్తే ఆనందం, మోక్షం లభిస్తాయి.
సర్వతోముఖ నరసింహ:
ఈ సాలగ్రామ బంగారు వర్ణంలో, ఎక్కువ ముఖాలు, ఏడు చక్రాలను కలిగి ఉంటుంది.
పాతాళ నరసింహ:
దీనిలో ఎక్కువ సంఖ్యలో ద్వారాలు, చక్రాలు, రంగులు ఉంటాయి. ఆరాధించిన సాధువులకు అమరత్వాన్ని కలిగిస్తాడని నమ్ముతుంటారు.
ఆకాశ నరసింహ:
పెద్ద ముఖం, మధ్యలో పొడుచుకు వచ్చినట్లు ఉండే చక్రం ఉంటుంది. ఈ సాలగ్రమంను రుషులు మాత్రమే ఆరాధిస్తారు.
అధోముఖ నరసింహ:
మూడు చక్రాలు- పక్కల్లో రెండు, పైన ఒకటి ఉంటాయి. ఆరాధన వల్ల మోక్షం లభిస్తుంది.
జ్వాలా నరసింహ:
ముఖం చిన్నగా ఉంటుంది. రెండు చక్రాలు, వనమాల ఉంటాయి. ఆరాధన వల్ల ఐహిక ప్రపంచం నుంచి విముక్తి కలుగుతుంది.
మహా నరసింహ:
ఈ సాలగ్రామ రెండు చక్రాలు, రేఖలతో ఎంతో అందంగా ఉంటుంది.
Related News
Lord Shiva: అరుణాచలం శివుడి ప్రత్యేకత ఎంటో తెలుసా.. చారిత్రక నేపథ్యం ఇదే
Lord Shiva: ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే అరుణాచలం ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది. పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు “మీ నుండి ఇంత �