Vasthu Tips: వాస్తు ప్రకారం పగిలిన అర్థం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా?
వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం అస్సలు ఉండకూడదని ఇది ఎన్నో రకాల సమస్యలను, నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 09:30 AM, Sun - 23 March 25

మామూలుగా పగిలిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తాయని అంటూ ఉంటారు. అలాంటి వస్తువులను ఇంట్లో అస్సలు పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పగిలిపోయినవి కొన్ని జ్ఞాపకం గా ఉంచుకోవడం కోసం లేదంటే పరిస్థితులు బాగోలేక అలా పగిలిపోయిన వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల పగిలిపోయిన వస్తువులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో అద్దం కూడా ఒకటి. పెద్ద అద్దం పగిలిపోయిన కూడా ఆ చిన్న ముక్కలను ఒకటిగా చేసి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా పగిలిన అద్దం ఇంట్లో అస్సలు ఉండకూడదట. ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
మరి పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇదివరకటి రోజుల్లో లక్ష్మీదేవిని అద్దంతో పోల్చేవారు. ఎందుకంటే అద్దం ప్రతిబింబం చూపిస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో కదిలిపోతూ ఉంటుందని కానీ అద్దం పగిలితే లక్ష్మీదేవి కూడా ముక్కలవుతుందని నమ్మేవారు. అద్దం పగిలితే ఇంట్లో కష్టాలు తప్పవని శాంతి ఉండదని అనేక సమస్యలు కూడా ఏర్పడతాయని పురాణాలలో చెప్పబడింది. అలాగే అద్దం పగిలినప్పుడు ఇంటికి రాబోయే శక్తులు కూడా వెనక్కి వెళ్లిపోతాయట. అలాగే అద్దం సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యమైనదని, అద్దం ఇంటి ముందుగా ఉండటం, దానిలో ప్రతిబింబాలు ప్రకాశించే విధానం కూడా ఇంటి శక్తి మీద ప్రభావం చూపిస్తుందట. కొందరు ఇంటిలో అద్దం నేరుగా తల మీద ఉంచితే, అది విపరీతమైన ఫలితాలను ఇవ్వదని విశ్వసిస్తారు.
పగిలిన అద్దంలో ముఖం చూసినట్లయితే అది మరణాన్ని సూచిస్తుందట. పగిలిన అద్దంలో ముఖం చూసుకున్నట్లైతే ఆ పగిలిన అద్దం మాదిరిగా మనిషి ప్రాణం కూడా ముక్కలవుతుందని నమ్మకం. అట్లాంటి విశ్వాసాలు అనేక మందిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అందువల్ల, పగిలిన అద్దాన్ని వెంటనే మార్చి, ఇంట్లో ఉంచకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. పూజ సమయంలో నో అద్దం ఉన్నప్పటికీ దానిని ఎప్పుడుపడితే ఎప్పుడు వినియోగించుకోవడానికి ఉండదట. పూజ సమయంలో అద్దాన్ని అస్సలు వినియోగించుకోకూడదట. పూజలు చేస్తున్న సమయంలో పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఆ పూజలు ఫలించవని చెబుటున్నారు. అద్దం పగిలినప్పుడు అద్భుతమైన శక్తిని ఆహ్వానించే వాస్తు సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అద్దం పగిలిపోవడం వల్ల ఇంటిలో అదృష్టం, సమృద్ధి, ఆనందం తగ్గిపోతుందనిముఖ్యంగా ఆ అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్లైతే చాలా విశ్వసిస్తారు. అలాగే, పగిలిన అద్దంలో ముఖం చూసే ప్రక్రియను తీవ్రంగా తప్పుగా భావించి, ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా పగిలిన అద్దాన్ని వీలు పడితే మార్చేసి, ఇంటిలో శుభం, శాంతి, సంపద పెరుగుతుందట.