Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ఈవారంలో మేష రాశి(Weekly Horoscope)లోని డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ నాయకులకు టైం కలిసొస్తుంది.
- By Pasha Published Date - 10:06 AM, Sun - 20 April 25

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Nara Chandrababu : జయహో చంద్రబాబు.. 75వ బర్త్‌డే వేళ జీవన విజయ విశేషాలివీ
మేషం
ఈవారంలో మేష రాశి(Weekly Horoscope)లోని డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ నాయకులకు టైం కలిసొస్తుంది. కొన్ని వ్యయ ప్రయాసలు తప్పవు. ఈ రాశివారికి ఏలినాటి శని ఆరంభమైంది. విఘ్నాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమించాలి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి.
వృషభం
ఈవారంలో వృషభ రాశివారికి గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి ఇది సరైన టైం. ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మిథునం
ఈవారంలో మిథున రాశి వారికి వివిధ పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల పరిణామాలు జరుగుతాయి.బుధాదిత్య యోగం వల్ల ఉద్యోగాల్లో శుభ పరిణామాలు జరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి. పాత అప్పులు వసూలవుతాయి. నిర్ణయాలు తీసుకునే క్రమంలో తొందరపాటు వద్దు.
Also Read :AP DSC 2025 Notification: సీఎం చంద్రబాబు కానుకగా రేపు డీఎస్సీ నోటిఫికేషన్!
కర్కాటకం
ఈవారంలో కర్కాటక రాశివారు కొన్ని గుడ్ న్యూస్‌లను వింటారు. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునే మార్గాలు కనిపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీపై అసూయపడే వాళ్లతో బీ అలర్ట్. అధికార యోగం ఉంది. మీరు పెట్టే పెట్టుబడులతో లాభాలు పండుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ధన లాభం వస్తుంది.
సింహం
ఈవారంలో సింహరాశి వారు కోపతాపాలకు పోవడం మంచిది కాదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. సహనంతో ఆలోచనలు చేయండి. ఇతరుల గొడవల్లో తలదూర్చొద్దు. కొత్త వ్యాపారాలకు కరెక్ట్ టైం కాదు. డబ్బు విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. పాత అప్పులు వసూలవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కన్య
ఈవారంలో కన్యరాశి వారు మనోధైర్యాన్ని ప్రదర్శించాలి. ఆపదలు వస్తే సహనంతో అధిగమించాలి. ఆత్మీయులతో విభేదాలు తలెత్తే ముప్పు ఉంది. అప్పుల సమస్యలు చుట్టుముడతాయి. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రాశి మీద రాహు కేతువుల ప్రభావం ఉంది.
తుల
ఈవారంలో తులరాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయ స్ఫూర్తి ఉంటే విజయాలు మీవే. ఇతరుల గొడవల్లో తలదూర్చొద్దు.షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. వివిధ వృత్తుల వారికి మంచి టైం. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి.
వృశ్చికం
ఈవారంలో వృశ్చిక రాశివారికి వ్యాపార నష్టాలు వచ్చే ముప్పు ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేే సూచనలు ఉన్నాయి. ఆదాయం అకస్మాత్తుగా పెరగొచ్చు. అదనపు బాధ్యతల కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో భారంగా ఫీలవుతారు. వస్త్రాభరణాలు కొంటారు.
ధనుస్సు
ఈవారంలో ధనుస్సు రాశివారు విమర్శలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. వాటిని పట్టించుకోవద్దు. మీదైన శైలిలో ముందుకు సాగండి. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోండి. అర్ధాష్టమ శని దోషం తగ్గుతుంది.జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
మకరం
ఈవారంలో మకర రాశి వారికి లక్ష్మీయోగం ఉంది. వ్యాపారం కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు పండుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
ఈవారంలో కుంభరాశి వారికి భూలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ధనయోగం ఉంది. చాలా క్రిటికల్ సమస్యలు, ప్రశ్నలు, సందేహాలు ఎదురుకావొచ్చు. అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోండి.డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మీనం
ఈవారంలో మీన రాశి వారు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కష్టాలు ఎదురైతే మనోబలంతో ముందుకు సాగాలి. నిరుత్సాహ పడొద్దు. అపార్థాలకు తావు ఇవ్వొద్దు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఎవరినీ అతిగా నమ్మొద్దు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.