Friday Remedies: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం రోజు ఏం చేయాలో మీకు తెలుసా?
Friday Remedies: శుక్రవారం లక్ష్మీదేవికీ ఇష్టమైన రోజు. అలాంటి రోజు ఆ అమ్మవారు మెచ్చిన మూడు రంగుల బట్టలను కనుక ధరిస్తే ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:31 AM, Wed - 8 October 25

Friday Remedies: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతీ ఒక్కరు కోరుకోవడం తో పాటుగా ఎన్నో రకాల పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కాగా లక్ష్మి దేవి చంచల స్వభావం కలిగి ఉంటుందని అంటూ ఉంటారు. అంటే ఒకచోట స్థిరంగా ఉండదు అని అర్థం. ఇకపోతే లక్ష్మీదేవిని శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శుక్రవారం రోజు లక్ష్మిదేవి అమ్మవారికి చాలా ప్రీతికరం.
వారంలోని ఏడు రోజులలో శుక్రవారం అంత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. మీరు జీవితంలో శుభకరమైన, సానుకూల ఫలితాలు పొందాలంటే శుక్రవారం రోజు మూడు రంగులను ధరించాలని చెబుతున్నారు. ఆ మూడు రంగులు ఎరుపు, తెలుపు, గులాబీ. ఈ మూడు రంగులు లక్ష్మీదేవికి ఎంతో పీతిపాత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ మూడు రంగులలో దేనినైనా ధరించవచ్చట. శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని, ఇది అందం, ప్రేమ, సంపద, వైవాహిక ఆనందం, శ్రేయస్సు మూలకంగా పరిగణిస్తారట. శుక్రుడితో సంబంధం ఉన్న రంగులలో దుస్తులు ధరించడం కూడా భౌతిక ఆనందాలను తెస్తుందట.
శుక్రుడు తెలుపు, ఎరుపు గులాబీని కూడా ఇష్టపడతాడు. కాబట్టి శుక్రవారం ఈ రంగులను ధరించడం ద్వారా మనం లక్ష్మీ దేవితో పాటు శుక్రుడి ఆశీర్వాదాలను పొందవచ్చని చెబుతున్నారు. లక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు. కాబట్టి, శుక్రవారాల్లో, ఉదయం స్నానం చేసి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకున్న తర్వాత, మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ దేవిని పూజించాలట. ఈ రంగును ధరించి ఆమెను పూజించడం ద్వారా, ఆమె మీకు అపారమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందట. శుక్రవారం తెల్లని దుస్తులు ధరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రవారం తెల్లని దుస్తులు ధరించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడంతో పాటు మన జాతకంలో శుక్రుని స్థానం కూడా బలపడుతుందట. తెల్లని దుస్తులు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, జీవితంలో లేదా కుటుంబ జీవితంలో ప్రేమ పెరుగుతుందని అదృష్టం పెరుగుతుందని చెబుతున్నారు. శుక్రవారం గులాబీ రంగు దుస్తులు ధరించడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.