HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Ways To Attract Money At Home In Telugu Friday To Do Things For Money

Friday: శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ఇలా పూజిస్తే చాలు.. అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చోవడం ఖాయం!

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు శుక్రవారం రోజు లక్ష్మి దేవిని పూజించడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 12:31 PM, Sat - 28 December 24
  • daily-hunt
Friday
Friday

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. కొందరు జీవితాంతం ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు, దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆర్థిక సమస్యలు తగ్గవు. అందుకే చాలామంది ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా మిగలడం లేదని అంటుంటారు. ఎలాంటి దుబారా ఖర్చు చేయకపోయినా కూడా కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, కలహాలతో నిండి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ నిలవదట. అలాగే పరిశుభ్రంగా లేని ఇంట కూడా లక్ష్మీదేవి నివసించదని చెబుతున్నారు. ఇవన్నీ సరి చేసుకోకుండా డబ్బు రావడం లేదని తరచుగా అంటూ ఉండడం సరైనది కాదు. ముందు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి. కుటుంబంలో సమస్యలు ఉంటే, గొడవలు పడకుండా సహనంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెబుతున్నారు. ఏ ఇంట అయితే భార్య భర్తలు అనూహ్యంగా ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి వద్దన్నా వస్తూ ఉంటుందని చెబుతున్నారు. పిల్లలను అస్తమానం కొడుతూ తిడుతూ ఉండే ఇంట అసలు లక్ష్మీదేవి ఉండదట. రోజూ సూర్యోదయానికి ముందే గోమయంతో వాకిలి అలికి ముగ్గు పెట్టాలి. ముంగిట్లో ముగ్గు లేకపోతే ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదు.

ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లోని దారిద్య్రానికి కారణమైన ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు తొలిగిపోతాయని చెబుతున్నారు. అలాగే శుక్రవారం ఇంట్లో నలుమూలలా సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందట. అలాగే ప్రతి శుక్రవారం విధిగా శ్రీ లక్ష్మిదేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. పూజలో తామర పూలు, పారిజాతాలు, నీలం, తెలుపు రంగు శంఖు పూలు వినియోగిస్తే మంచిదని చెబుతున్నారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తేనే కలిపిన పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించాలట. ఇంట్లో డబ్బులు పెట్టే బీరువాలో పచ్చ కర్పూరాన్ని వస్త్రంలో చుట్టి ఉంచితే ఆర్ధిక సమస్యలు దూరమవుతాయట.

ఉద్యోగంలో స్థిరత్వం కోసం, ఆర్ధిక వృద్ధి కోసం శుక్రవారం దుర్గాదేవికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మీ పూజా మందిరంలో ఇప్పటి వరకు శంఖం లేకుంటే వెంటనే శంఖం మీ పూజా మందిరంలో ఉంచి ప్రతి రోజు పూజ తర్వాత ఇంటి యజమాని శంఖాన్ని పూరించడం వలన ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందట. శుక్రవారం మనీప్లాంట్ నాటడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయట. అయితే ఈ మనీ ప్లాంట్ ఎవరి ఇంటి నుంచి అయినా తెచ్చుకుంటే ఫలితాలు వేగంగా లభిస్తాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉత్తరదిశలో వెండితో తయారు చేసిన ఏనుగులను ఉంచితే ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని ఆపడం మీ తరం కాదట. శుక్రవారం లక్ష్మీదేవిని బిల్వ పత్రాలతో పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందట. శుక్రవారం గోమాత తోక భాగం వైపు పసుపు కుంకుమలతో పూజించి, గోమాతకు పచ్చగడ్డి తినిపిస్తే తరతరాలుగా వస్తున్న దారిద్ర్య బాధలు తొలగిపోతాయట. అన్నింటికన్నా ముఖ్యమైన పరిహారం ఏమిటంటే సూర్యోదయంకు ముందే నిద్ర లేవడం. బద్దకం, సోమరితనం లక్ష్మీదేవికి నచ్చని గుణాలు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attract money
  • friday
  • lakshmi
  • lakshmi devi

Related News

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd