HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu What Will Happen If A Shadow Of Temple Falls On House Know

Vasthu Tips: దేవాలయం నీడ ఇంటిపై పడితే ఏం జరుగుతుందో తెలుసా?

దేవాలయం.. ఇది ఒక పవిత్ర స్థలం. మనకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా ఒక్కసారి ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరిచిపోయి మనసుకు ప్రశాంతత కలుగుత

  • By Anshu Published Date - 09:30 PM, Tue - 6 June 23
  • daily-hunt
Vasthu Tips
Vasthu Tips

దేవాలయం.. ఇది ఒక పవిత్ర స్థలం. మనకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా ఒక్కసారి ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరిచిపోయి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం. ఆలయంలో ఎల్లప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట, గుడినీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకే పురాతన గుళ్ల చుట్టూ పెద్ద ప్రహరీగోడలు నిర్మించి ఉంటాయి.

అయితే గుడి సమీపంలో నివాస స్థలాలు ఉంటే కొంత మంచి, కొంత చెడు రెండూ ఉంటాయని అంటూ ఉంటారు.. మరి ఒకవేళ మన ఇంటిపై గుడి నీడ పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు. ఒకవేళ గుడికి దగ్గర ఇల్లు ఉంటే ఆ కుటుంబలో కలహాలు చోటు చేసుకుంటాయి. ఏ ఆలయానికి దగ్గరలో తీసుకున్నా కనీసం 200 అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకోవడం మంచిది. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండవచ్చు.

శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు. అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరని చెబుతారు. విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఉత్తరాన, వాయువ్యంలో ఉంటే అక్కడ ఉన్న వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఏ ఆలయానికి అయినా కనీసం 100 అడుగుల దూరం తప్పనిసరి అని చెబుతారు వాస్తు పండితులు.

అలాగే ఇంటిపై ఆలయం నీడే కాకుండా ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు. దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి. పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమం. నదుల వద్ద నిర్మిస్తే ఫలితం మధ్యమం. గ్రామం, నగరంలో అధమం అని మహర్షులు శ్లోక రూపంలో చెప్పారు. ఇప్పటికే ఆలయాల నీడ పడేచోట ఇల్లు ఉంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు వాస్తు పండితుల సలహామేరకు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • house
  • temple shadow
  • temple shadow on house
  • Vasthu Tips

Related News

Papaya Plant

‎Papaya Plant: మీ ఇంటి ముందు కూడా బొప్పాయి చెట్టు ఉందా.. అయితే ఆర్థిక ఊబిలో కూరుకుపోవడం ఖాయం!

‎Papaya Plant: వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు బొప్పాయి మొక్క ఉండడం అంత మంచిది కాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Crow

    Crow: ఇంటి ముందుకు ఈ దిశలో కాకి అరుస్తుందా.. అయితే జరగబోయేది ఇదే?

  • Spirituality

    Spirituality: మీ ఇంట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే!

Latest News

  • Mrunal Dating : డేటింగ్ వార్తలపై మృణాల్ ఫుల్ క్లారిటీ

  • AI University : రెండు నెలల్లో AI యూనివర్సిటీ ప్రారంభం – శ్రీధర్ బాబు

  • Avatar 3 Tickets: ‘అవతార్ 3’ టికెట్ బుకింగ్స్‌ తేదీ ఖరారు!

  • KCR : పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు – సీఎం రేవంత్

  • High Court Notice : రేవంత్ సర్కార్ కు హైకోర్టు నోటీసులు

Trending News

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

    • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd