HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu Tips Wealth Prosperity With Aparajita Flowers And Many More Vastu Benefits

Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?

హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి.

  • Author : Anshu Date : 15-02-2024 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aparajita Plant Benefits Vastu Feature Compressed
Aparajita Plant Benefits Vastu Feature Compressed

హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి పూలలో అపరాజిత పుష్పాలు కూడా ఒకటి. వీటినే
శంఖు పుష్పాలు అని కూడా పిలుస్తారు. గొప్ప ఆయుర్వేద లక్షణా లు కూడా అపరాజిత పుష్పాలకు ఉన్నాయి. ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంఖు మాదిరిగా అందమైన షేప్ లో, ఈ అపరాజిత పుష్పాలు ఉంటాయి.

అపరాజిత పుష్పాలు విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. మాములుగా ఈ పుష్పాలు రెండు రంగులలో ఉంటాయి. తెలుపు రంగు, నీలం రంగు. తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలు శివునికి సమర్పిస్తారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడంలో కూడా నీలం రంగు అపరాజిత పుష్పాలను నివేదిస్తారు. హిందూధర్మం లోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అపరాజిత పుష్పం సంపద శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధించాలన్నా అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడపడితే అక్కడ దానిని పెంచకూడదు. కచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలి. మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు ఉత్తరం దిశలో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అపరాజిత పూలతో శని దేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే అపరాజిత మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకొని మీరు సంపదను రెట్టింపు చేసుకోవడంతో పాటు, ముసలి నుంచి గట్టెక్కండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aparajita
  • aparajita flowers
  • Aparajita Plant
  • money
  • problems
  • vastu tips

Related News

Is planting a banana tree at home inauspicious? What do the scriptures say?

Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

ప్రకృతి ప్రేమికులు ఎన్నో రకాల మొక్కలు పెంచాలనుకుంటారు. అయితే కొన్ని మొక్కల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అందులో ఒకటి అరటి చెట్టు. ఈ చెట్టును పెరట్లో కానీ… ఇంటి ముందు కానీ నాటితే ఎలాంటి లాభనష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. అరటి చెట్టు ప్రతి భాగం ఉపయోగపడుతుంది. వాటి ఆకులను ఆహారం తినడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లో ఈ చెట్టును పెంచేందుకు ఆసక్తి చూపరు. ఎందుకంటే కొంతమంది ఉ

    Latest News

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd