Vastu Tips: మీ ఇంట్లో గడియారం ఆ దిశలో ఉందా.. అయితే సర్వ నాశనమే?
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గడియారం తప్పనిసరిగా ఉంటుంది. దాదాపుగా గడియారం లేని ఇల్లు ఉండదేమో. స్మార్ట్ ఫోన్ లు,స్మార్ట్ వాచ్ లు, అలాగే చేతి
- By Anshu Published Date - 07:40 PM, Wed - 17 May 23

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గడియారం తప్పనిసరిగా ఉంటుంది. దాదాపుగా గడియారం లేని ఇల్లు ఉండదేమో. స్మార్ట్ ఫోన్ లు,స్మార్ట్ వాచ్ లు, అలాగే చేతి వాచ్ ల వినియోగం పెరిగినప్పటికీ ఇంట్లో తప్పనిసరిగా గడియారం ఉండాల్సిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గడియారం ని వాస్తు ప్రకారం గా అమర్చకపోతే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గడియారంని గోడ పై తగిలించే ముందు తప్పనిసరిగా వాస్తు విషయాలను పాటించాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
అయితే ఇంట్లో మనం వాల్ క్లాక్‌ని తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపున్న గోడకు వేలాడదీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు వేలాడదీయవద్దు అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఇంటి మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్‌కి వాల్ క్లాక్‌ని అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే ఆ వాల్ క్లాక్ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి కరువై తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి.
అనవసర వివాదాలు, కష్టాలు, నష్టాలు, నిత్య ఓటమి తప్పదు. కొంత మంది పాత వాచీలు, పాత క్లాక్ లను దాచుకుంటూ ఉంటారు.
పనిచేయవు కదా ఎందుకు దాచుతున్నారు అని అడిగితే యాంటిక్ పీస్ అని చెబుతారు. లేదంటే ఎవరైనా బహుమతిగా ఇచ్చింది అని వాటిని అలాగే ఉంచుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిన, విరిగిన, పగిలిన, పాడైన, చిరిగిన, దెబ్బతిన్న వాచీలు, వాల్ క్లాక్‌లను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీ లైఫ్ లో సంతోషం ఆగిపోతుంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మీ ఇంట్లో ఎన్ని వాచ్లు, వాల్ క్లాక్ లో ఉంటే అన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా పని చేయండి ఉంటే అందులో బ్యాటరీలు వేయడం లేదంటే దానిని పడేయడం చేయాలి. క్లాక్ ఆగిపోవడం అంటే మీ జీవితం ఆగిపోవడం అని అర్థం. అలాంటి క్లాక్ లు ఇంట్లో ఉంటే మీరు తలపెట్టిన ఏ పనీ పూర్తవదు. గోడగడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఉత్తరం దిశ కుబేరుడు, వినాయకుడి దిశగా పరిగణిస్తారు అందుకే ఉత్తర దిశ వైపు గడియారం ఉండడం ఎంతో శుభప్రదం తూర్పు వైపు చెక్క గడియారం వేలాడదీస్తే ఇంటికి వృద్ధిని ఇవ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గోడగడియారం ఎప్పుడూ కూడా దక్షిణ దిశ గోడ వైపు పెట్టకూడదు. దక్షిణం దిక్కు స్థిరత్వానికి దిక్కు. ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది.