Vastu Tips : రాశి ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే మీరు ఇక ధనవంతులే
మీ రాశిని బట్టి కొన్ని శుభ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే జీవిత సమస్యలన్నీ తీరుతాయి.
- By Hashtag U Published Date - 06:00 AM, Thu - 26 January 23

మీ రాశిని బట్టి కొన్ని శుభ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే జీవిత సమస్యలన్నీ తీరుతాయి. ప్రతి విషయంలోనూ విజయాన్ని అందుకోవచ్చు. ఒక్కో గ్రహానికి, ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేక బిందువు ఉంటుంది. ఆ రాశిచక్ర గుర్తులు, గ్రహాలు ఈ బిందువు వల్ల నియంత్రించబడతాయి. అందుకే దాన్ని ఆ రాశిచక్రం యొక్క మూలం లేదా ప్రధాన బిందువు అని కూడా అంటారు. ఆ రాశిచక్రం యొక్క కీ లేదా ప్రధాన బిందువుకు సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉంచినట్లయితే, జీవితంలోని అన్ని సమస్యలు తీరుతాయి.
రాశి ప్రకారం ఇంట్లో ఈ వస్తువులను ఉంచండి
* మేషం – రాగి విగ్రహం లేదా సింధూరం నింపిన మట్టి దీపం
* వృషభం – దక్షిణవర్తి శంఖం
* మిథునం – గాజు పాత్రలో క్రిస్టల్ బాల్
* కర్కాటకం – గుల్లలు, గవ్వలు
* సింహం – ఎర్రటి గుడ్డ లేదా ఎర్రని వస్త్రంలో చుట్టబడిన పోకలు
* కన్యారాశి – శివలింగం
* తులారాశి – శ్రీ యంత్రం
* వృశ్చికం – సీసా లేదా గాజు బాక్సులో నింపిన గంగాజలం
* ధనుస్సు – గోమతీ చక్రం లేదా పంచముఖి రుద్రాక్ష
* మకరం – గుర్రపుడెక్క
* కుంభం – తెల్ల రాతి విగ్రహం
* మీనం – సముద్రపు ఉప్పు లేదా ఉప్పు ముద్ద
మీ రాశి ఏదో తెలియకుంటే ఇలా..
ఒకవేళ మీకు మీ రాశి ఏదో తెలియకుంటే ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం సముచితం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ..
శంఖం మరియు గాజులో నింపిన నీటిని ఉంచండి. సంపద, ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రీ యంత్రం ఇంట్లో ఉంచండి.సంతానం కోసం పసుపు లేదా ఆకుపచ్చ రంగు క్రిస్టల్ పిరమిడ్ ఉంచండి.
ఇంట్లో ఆనందం, శాంతి కోసం వేణువు లేదా బాల కృష్ణుడి
విగ్రహం ఇంట్లో పెట్టుకోండి. చిన్న గాజు సీసాల్లో ఉప్పు వేసి ఇంట్లోని అన్ని మూలల్లో ఒక్కొక్కటిగా ఉంచండి. అయితే ఈ వస్తువులను ఇంట్లో పెట్టే ముందు పాలు లేదా నీళ్లతో కడుక్కోవాలి. మాటిమాటికి వీటి ప్లేస్ మార్చొద్దు. పూజ స్థలంలో లేదా డబ్బు వద్ద కూడా వీటిని ఉంచడం మంచిది. పడకగదిలో గాజు వస్తువులు లేదా శంఖం పెంకులను ఉంచొద్దు. బెడ్ రూమ్ లో మందులు కూడా తీసుకోవద్దు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఈ వస్తువులను శుభ్రం చేసి పూజించండి. ఈ చర్యలు మంచి ఫలితాలను
ఇస్తాయి. ఉదయాన్నే ఇంటిలోని ప్రతి గదిలో శంఖాన్ని ఊదండి. అన్నం సిద్ధం చేసేటప్పుడు ఏలకులు లేదా తులసి ఆకులను జోడించండి. ఇంటి ప్రతి మూలలో అగరబత్తులు లేదా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించండి. అగరుబత్తీలు వెలిగించిన తర్వాత మంచం కింద ఉంచడం మంచిది.
Related News

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!
తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది.