Vastu Tips: ఇంటి పై కప్పుపై చెత్త సామాన్లు పెడుతున్నారా.. అయితే ఆర్థిక కష్టాలు రావడం ఖాయం?
మామూలుగా చాలామంది ఇంట్లో ఉండే చెత్త సామాన్లను స్టోర్ రూమ్ లో వేస్తే ఇంకొందరు ఇంటి మిద్దె అనగా ఇంటి పైకప్పు పై వేస్తూ ఉంటారు. దాంతో ఇంటి మిద
- By Nakshatra Published Date - 08:00 PM, Thu - 28 December 23
మామూలుగా చాలామంది ఇంట్లో ఉండే చెత్త సామాన్లను స్టోర్ రూమ్ లో వేస్తే ఇంకొందరు ఇంటి మిద్దె అనగా ఇంటి పైకప్పు పై వేస్తూ ఉంటారు. దాంతో ఇంటి మిద్దె మొత్తం అంతా కూడా చెత్త సామాన్లతో చిందరవందరగా ఉంటుంది. అయితే ఇలా వేయడం అస్సలు మంచిది కాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటి పైకప్పు మీద వాడని వస్తువుల పోగెయ్యటం, చెత్త చేరినా పట్టించుకోకపోతే ఇంట్లో వారి అభివృద్ధికి ఆటంకాలు కొని తెచ్చుకున్నట్టే. ఇంట్లో గొడవలు పెరిగి మన:శాంతి కరువవుతుంది. అందుకె వాస్తు నియమాలను అనుసరించి ఇంటి పైకప్పు మీద ఎల్లప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి.
డాబా మీద విరిగిపోయిన, పాడైపోయిన, వాడని వస్తువులు పడెయ్యడం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం నుంచి కుటుంబసభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాల వరకు అన్నింటి మీద వ్యతిరేక ప్రభావాలు పడతాయి. ఇంటి మీద చేరిన చెత్త సామాన్లను తొలగించకపోతే వాస్తు దోషాలతో పాటు పితృదోషాలు కూడా పీడిస్తాయి. ఇంటి వాతావరణం మొత్తం పాడైపోతుంది. అభివృద్ధి నిలిచిపోతుంది. ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. పాడైపోయిన లేదా పనికిరాని సామాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో లేదా డాబా మీద ఇలా ఎక్కడా పెట్టుకోకూడదు. వెంటనే వాటిని ఇంటి బయటకు పంపెయ్యాలి.
ఎప్పుడైనా పనికి వస్తాయనుకునే వస్తువులను డాబా మీద పడెయ్యకూడదు. అలాంటి వస్తువుల ఏవైనా ఉంటే వాటిని ఏదైనా వస్త్రంలో చుట్టి జాగ్రత్త చేసుకోవాలి. కానీ డాబా మీద పడెయ్యకూడదు. డాబా మీద ఎప్పుడూ శభ్రంగా ఉండేలా చూసుకోవాలి. డాబా మీద ఏవైనా వస్తువులు పెట్టాలని అనుకున్నా చెత్త కుప్పలాగా వెయ్యడం మంచిది కాదు. ఒకవేళ పెట్టినా కూడా అక్కడ పెట్టిన వస్తువులు కూడా ఒక క్రమపద్ధతిలో అందంగా శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్త పడాలి.
తూర్పు వైపు ఉండే కిటికి నుంచి ఎండ ఎక్కువగా ఇంట్లోకి ప్రసరించే విధంగా ఉండాలి. ఇలా ఉన్నపుడు ఇంట్లోకి ఐశ్వర్యం ప్రవేశిస్తంది. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు సింహ రాశికి అధిపతి. ఈశాన్యం కేతు దిశ. ఈ దిక్కున గుమ్మనికి పక్కగా మెట్లు ఉండకూడదు. ఇలా ఉండడం దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. ఈశాన్యం బృహస్పతి స్థానం కనుక దిక్కున పూజ గది ఉండడం మంచిది. ఉత్తరం, తూర్పు రెండు కూడా మెయిన్ ఎంట్రెన్స్ కు అనువైనవి. కానీ డోర్ పక్కన చెప్పుల రాక్ ఉండడం మంచిది కాదు. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తుంది. 3 కంటే ఎక్కువ ఎంట్రెన్స్ డోర్స్ ఉండడం అన్ లక్కీ. ఇది సమస్యలకు ఆహ్వానం పలకడమే.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.