Vastu Tips: కామధేను విగ్రహం పెట్టుకుంటే వాస్తు విషయాలు పాటించాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
కామధేను విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:34 PM, Mon - 2 December 24

కామధేను విగ్రహం సంపద, శ్రేయస్సు, ఆనందం , శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ప్రజలు కామధేను ఆవు విగ్రహాన్ని తమ కార్యాలయంలో, దుకాణంలో లేదా డబ్బు ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటున్నారు. అయితే కామధేను ఆవు దూడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మరి ఈ విగ్రహాన్ని పెట్టుకునే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ కామధేనువు విగ్రహాన్ని ఇంట్లోనే పూజ గదిలో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారట. విగ్రహాన్ని శ్రీ హరి విష్ణు , లక్ష్మీదేవి దగ్గర ఉంచాలి. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందట.
ఆదాయం విషయంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అవి కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. కామధేను విగ్రహాన్ని ఉంచడానికి సరైన దిశ.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కు శుభప్రదంగా పరిగణించబడుతుంది. కామధేనువు విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు దానిని పూజ స్థలంలో ఉంచలేకపోతే ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లో ఉంచవచ్చట. విగ్రహంలో ఆవు దాని దూడను కలిగి ఉండటం కూడా శుభప్రదంగా భావిస్తారు. వ్యాపారంలో పురోగతి, శ్రేయస్సు పొందడానికి ఆఫీసులో కూర్చున్న ప్రదేశంలో కుడి లేదా ఎడమ వైపున కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచవచ్చట.
అంతేకాదు వ్యాపార స్థలంలో డబ్బు ఉంచే ప్రదేశంలో కామధేనుడి విగ్రహాన్ని కూడా ఉంచవచ్చని చెబుతున్నారు. విగ్రహాన్ని ఎక్కడ పెట్టకూడదు అన్న విషయానికి వస్తే.. టాయిలెట్ దగ్గర అసలు పెట్టకూడదని అలా పెడితే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంట్లో ఒకే ఒక్క కామధేను విగ్రహం లేదా చిత్రం మాత్రమే ఉండాలని గుర్తుంచుకోవాలి. కామధేను విగ్రహాన్ని ఉంచడం వల్ల కోరికలను తీరుస్తుందట. కామధేను ఆవు విగ్రహాన్ని చూస్తే చాలు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు.