Vastu For Home: ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు ఆనందాలే.. పూర్తి వివరాలు ఇదిగోండి!
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి కష్టాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలి. ఇంట్లో కూడా
- By Nakshatra Published Date - 06:45 AM, Wed - 20 July 22
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి కష్టాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలి. ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్లిన లేదంటే మన ఇళ్లలో ఉన్నప్పుడు మనకు పాజిటివ్ వైబ్ కలుగుతూ ఉంటుంది. అటువంటి ప్రదేశాలలో ఉన్నంతసేపు కూడా మనసు అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలలో పాజిటివ్ వైబ్ కలగడానికి వాస్తు కారణమట. అదే ఇండ్లలో నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంటే చిరాకుగా అనిపించడం,చిన్న చిన్న వాటికీ సమస్యలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఇళ్ళు సంతోషంగా ఉండాలి అంటే అందరికీ మానసిక స్థితి సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. మరి ఇంట్లో సానుకూల శక్తిని పెంచే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ మన మూడ్ ని, ఆలోచనలను కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఇంటికి పసుపు, నారింజ వంటి రంగులు వేయించాలి. సెరటోనిన్ హ్యాపీ హార్మోను విడుదల చేసే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే ఇంట్లోనే గోడల మీద సంతోషకరమైన ఫోటోలు తగిలించి ఉంచాలి. ఆనందంగా తమాషా ఫోటోలను పెట్టుకోవడం వల్ల వాటిని చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుంది.
అదేవిధంగా మొక్కలు ఇంటి ఆవరణలో మాత్రమే కాకుండా ఇంటి లోపల ఆరు బయట కూడా పెంచాలి. వీలైనన్ని మొక్కలను ఇంటి లోపల పెంచడం వల్ల అవి ఎక్కువ శాతం పాజిటివ్ వైబ్ ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఇంట్లోని అన్ని గదుల్లో పచ్చని మొక్కలు ఉండటం వల్ల ఆనందంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోనే గోడలకు గ్రాఫిక్స్ డిజైన్స్ అనిమల్ బాడీ డిజైన్స్ వేసుకోవచ్చు. అలా డిజైన్ వచ్చిన వాటిని కర్టెన్, రగ్గులు,ఫర్నిచర్ కవర్ లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇంటికి వీలైనంత ఎక్కువ కిటికీలను ఉపయోగించడం ఎంతో మేలు. అలాగే పెంపుడు జంతువులు ఇంట్లో ఉండడం వల్ల ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. ఆ జంతువులు చేసే చిలిపి చిలిపి పనులు వల్ల మనకు ఆనందం కలుగుతుంది.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.