Vastu Tips: ఇంట్లో ఈ 6 జంతువుల ఫోటోలు ఉంటే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చాలామంది ఎన్నో రకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. జంతువుల ఫోటోలు పక్షుల ఫోటోలు నేచర్ ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు.
- By Nakshatra Published Date - 08:54 PM, Fri - 9 February 24
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చాలామంది ఎన్నో రకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. జంతువుల ఫోటోలు పక్షుల ఫోటోలు నేచర్ ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. వాటితో పాటుగా వాస్తు ప్రకారం కొన్ని జంతువుల ఫోటోలు పెడితే అదృష్టం కలిసొస్తుందట. మెరుపువేగంతో ఇంటికి డబ్బు వస్తుందట. ముఖ్యంగా ఆరు జంతువుల ఫోటోలను, బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది అంటున్నారు పండితులు. ఇంతకీ 6 జంతువుల ఫోటోలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో పెట్టుకోవలసిన జంతువుల ఫోటోలు, లేదా విగ్రహాలలో ఏనుగుల జంట ముఖ్యమైనది. ఏనుగుల జంటను ఇంట్లో పెట్టుకుంటే ఆ కుటుంబం సమిష్టిగా ఉంటుంది. అంతేకాదు ఆర్థికంగా కూడా శక్తివంతంగా ఉంటుంది.
ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక జంతువు ఫోటో తాబేలు. తాబేలు ఫోటోలు కానీ, తాబేలు బొమ్మను గానీ పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తాబేలు విష్ణువు రూపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇంటికి తూర్పున లేదా ఉత్తరం వైపున తాబేలును పెట్టడం మంచిదని సూచించబడింది. హంసల జంట ఫోటోలు పెట్టుకుంటే చాలా మంచిది. డ్రాయింగ్ రూమ్ లో కానీ బెడ్ రూమ్ లో గాని హంసల జంట ఫోటోలు పెడితే బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా బెడ్రూంలో హంసల జంట ఫోటో వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది. వాస్తు ప్రకారం చేపల ఫోటోలను, బొమ్మలను, లేదా నిజమైన చేపలను ఇంట్లో పెట్టుకుంటే సంపద, శక్తి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందట.
చేపలను శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎవరి ఇంట్లో చేపలు ఉంటే ఆ ఇంట్లోకి సంపద వచ్చి తీరుతుంది. ఇంట్లో ఆవు ఫోటోలను కానీ, బొమ్మలను కానీ పెట్టుకుంటే మంచిదని చెబుతారు. ఆవులో అందరు దేవతలు నివసిస్తారు అని చెబుతారు. కాబట్టి ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇక ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక జంతువు ఫొటో ఒంటె. ఒంటె పోరాటానికి, విజయానికి ప్రతీక. ఇంట్లో ఉన్న డ్రాయింగ్ రూమ్ లో కానీ లివింగ్ రూమ్ లో కానీ వాయువ్య భాగంలో కానీ ఒంటె ఫోటోను, బొమ్మలను గాని ఉంచడం వల్ల కలిసొస్తుందని, అనుకున్న పనులు నెరవేరుతాయని, సంపద వృద్ధి జరుగుతుంది.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.