Tulsi Puja: తులసి మొక్కను, తులసీ దళాలు కోయడానికి నియమాలు ఉన్నాయని మీకు తెలుసా?
తులసి మొక్కను పూజించేటప్పుడు అలాగే తులసి దళాలను కోసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
- By Anshu Published Date - 01:32 PM, Wed - 25 December 24

హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా పూజ చేసే క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా తెలియని తప్పులు కూడా చేస్తుంటారు.. అందుకే తులసి పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలను పాటించాలని పండితులు చెబుతుంటారు. తులసి మొక్కను పూజించేటప్పుడు మాత్రమే కాకుండా తులసీదళాలు తెంపేటప్పుడు కూడా కొన్ని రకాల నియమాలు పాటించాలట. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. అందుకే విష్ణు పూజలో తులసి దళాలకు విశిష్ట స్థానం ఉంది. తులసిని ఖచ్చితంగా సమర్పిస్తారు. ప్రతిరోజూ ఉదయం తులసి మొక్కకు నీళ్ళు సమర్పిస్తారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టే సంప్రదాయం ఉంది. అయితే సాయంత్రం వేళ తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని, ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. శ్రీ మహా విష్ణు పూజలో, ఆయనకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను తప్పని సరిగా ఉపయోగిస్తారు. అయితే తులసిని తాకడానికి, తులసి దళాలను కోయడానికి శాస్త్రాలలో అనేక నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను ఆదివారం, ఏకాదశి, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో తులసి మొక్కను తాకకూడదు.
ఆదివారం రోజున లక్ష్మిదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. అందుకే ఈ రోజు తులసిని తాకడం, నీరు సమర్పించడం వంటివి చేయకూడదని చెబుతున్నారు. రాత్రి సమయంలో తులసి మొక్కని అస్సలు తాకకూడదు. రాత్రి సమయంలో తులసిని తాకడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అదేవిధంగా ఏకాదశి, ఆదివారం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, రాత్రి సమయాల్లో తులసి దళాలను మొక్క నుంచి కోయకూడదట. అదే సమయంలో తులసి మంజరిని ఆదివారం, మంగళవారం విచ్ఛిన్నం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.