Vastu Tips: ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారా? ఈ వాస్తు టిప్స్ పాటించండి!
సాధారణంగా మనం పడుకునే సమయంలో బెడ్ చుట్టూ వాటర్ బాటిల్,మొబైల్స్, షూస్ లేదా చెప్పులు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఈ విధంగా ఉండటం అశుభం.
- By Nakshatra Published Date - 10:38 AM, Wed - 31 August 22
సాధారణంగా మనం పడుకునే సమయంలో బెడ్ చుట్టూ వాటర్ బాటిల్,మొబైల్స్, షూస్ లేదా చెప్పులు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఈ విధంగా ఉండటం అశుభం. కాగా పగలంతా కష్టపడి పని చేసి వచ్చిన వారు సాయంత్రం కాగానే కంటి నిండా నిద్రలేక నిద్రపోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వీటిని కారణం వాస్తు ప్రభావం కూడా కావచ్చు. అయితే వాస్తు శాస్త్రం అన్నది కేవలం ఇంటి దిక్కులు,మూలాలకు సంబంధించినది మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రం అన్నది ఒక వ్యక్తి జీవితంలో చాలా అర్థాన్ని కూడా కలిగిస్తుంది.
ఆ వాస్తు శాస్త్ర ప్రభావం మనిషి యొక్క జీవితంపై కూడా పడుతుంది. ఇక అటువంటి పరిస్థితు లలోనే , రాత్రి పడుకునేటప్పుడు, వాస్తు దోషానికి కారణమయ్యే వాటిని తల చుట్టూ ఉంచుకుంటాము. కాగా ఈ వాస్తు దోషాలు మనిషి ఆరోగ్యం నుండి జీవితం పై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. దాంతో నిద్ర సమస్య నుంచి ఆర్థిక సమస్యల వరకు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకే రాత్రి పడుకునే సమయంలో కొన్ని విషయాలు పట్ల శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. అయితే రాత్రిపూట నిద్రించే సమయంలో తలకింద ఎటువంటి వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందా.. సాధారణంగా చాలామంది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. తర్వాత ఆ చెప్పులను చాలా మంది మంచం కింద పెట్టుకోకూడదు ఉంటారు.
అలాగే షూస్ మరియు చెప్పులు ఎప్పుడూ తల చుట్టూ ఉన్న ప్రదేశాలలో ఉంచకూడదు. ఇలా చేయడం వాస్తు ప్రకారం అశుభం. ఇది జీవితంలో ప్రతికూలతను తెస్తుంది. అంతే కాకుండా, కొంతమంది తల కింద పర్సు పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం అశుభంగా చెప్పుకోవచ్చు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తుతాయి. అలాగే చాలా మందికి రాత్రిపూట లేచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీని కారణంగా వారు తమ చుట్టూ ఒక సీసా లేదా నీటి జగ్ ఉంచుకుంటారు, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, అలా చేయడం అశుభం.
ఇది జాతకంలో చంద్రునిపై ప్రభావం చూపడంతో పాటు మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.గీత లేదా సుందర్కాండ్ ను తలకింద పెట్టుకుని పడుకోవాలి. దీని కారణంగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే ముల్లంగిని సలాడ్ రూపంలో రాత్రి దిండు కింద ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది రాహువు యొక్క దోషాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ముల్లంగిని రాత్రంతా దిండు కింద ఉంచి, ఉదయం ఆలయానికి వెళ్లిన తర్వాత శివలింగానికి సమర్పించండి, ఇలా చేయడం ద్వారా జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయి.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.