Vastu: మీరు ఆఫీస్ కి తీసుకెళ్లే బ్యాగ్ లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే తీసేయండి.. లేదంటే?
Vastu: మనం ఆఫీస్ కి తీసుకెళ్లే బ్యాగ్ లో మనతో పాటుగా కొన్ని వస్తువులను అస్సలు తీసుకెళ్ల కూడదని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Wed - 1 October 25

Vastu: మామూలుగా చాలామంది ఇంటితోపాటు ఆఫీసులలో కూడా కొన్ని రకాల వాస్తు చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు మనము ఆఫీసుకి తీసుకు వెళ్లే బ్యాగులో కూడా కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు పండితులు. మరి ఆఫీసుకు తీసుకెళ్లే బ్యాగులో ఎలాంటి వస్తువులు ఉంచకూడదో, దానివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎప్పుడూ కూడా మీ ఆఫీస్ బ్యాగ్ లోపల పాత కరెంటు బిల్లులు, రసీదులు లేదా పాడైన కాగితాలను ఉంచడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటె దాని వల్ల ప్రతికూల శక్తి ప్రసరిస్తుందట. ఆఫీస్ బ్యాగ్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, కేవలం అవసరమైన డాక్యుమెంట్లు మాత్రమే పెట్టుకోవాలని,మిగిలినవన్నీ తీసివేయడం మంచిది అని చెబుతున్నారు. అదేవిధంగా ఆఫీసు బ్యాగ్ లోపల పెన్నును తప్పనిసరిగా ఉంచుకోవాలట. కానీ ఎప్పుడూ మీ బ్యాగ్ లోపల విరిగిన లేదా పాడైన పెన్నును ఉంచుకోకూడదని చెబుతున్నారు.
ఎందుకంటె పాడైన లేదా విరిగిన పెన్నును ఉంచుకోవడం వల్ల కార్యాలయంలో ఎల్లప్పుడూ ఆటంకాలు ఎదురవుతాయట. అలాగే ఆఫీస్ బ్యాగ్ లోపల మిగిలిపోయిన లంచ్ బాక్స్ ను ఉంచడం కూడా తప్పుగా పరిగణించాలట. మిగిలిపోయిన, పాడైన ఆహారం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా బ్యాగ్ లోపల పొరపాటున కూడా పదునైన లేదా మొనదేలిన వస్తువులను ఉంచకూడదని, ఈ వస్తువులు భద్రతాపరంగా ప్రమాదకరమైనవి, వాస్తు ప్రకారం కూడా ఇది తప్పు అని చెబుతున్నారు పండితులు. అత్యవసర పరిస్థితి వస్తే వాటిని బ్యాగ్ లో ప్యాక్ చేసి ఉంచాలని చెబుతున్నారు. అదేవిధంగా చాలా మంది ఆఫీసు బ్యాగుల్లో చాక్లెట్ రాపర్లు, విరిగిన పిన్ క్లిప్లు లేదా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ప్రతికూల శక్తి ఏర్పడుతుందట. ఇది మీ పనులన్నీ చెడిపోయేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు.