Hibiscus Plant: సూర్యుడికి మందార పువ్వులతో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?
మామూలుగా చాలామంది ఇంటి వద్ద అనేక రకాల పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. వాటిలో మందారం పువ్వు కూడా ఒకటి. ఈ మందార పువ్వులను దేవుళ్లకు అలంకరిం
- Author : Anshu
Date : 02-01-2024 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా చాలామంది ఇంటి వద్ద అనేక రకాల పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. వాటిలో మందారం పువ్వు కూడా ఒకటి. ఈ మందార పువ్వులను దేవుళ్లకు అలంకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మందార పూలు అంటే లక్ష్మీదేవి కి దుర్గ మాతకు ఎంతో ఇష్టం ఈ పువ్వులతో పూజ చేస్తే అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. ఈ మందారపు చెట్టు వాస్తు ప్రకారంగా ఇంట్లో నాటడం వల్ల గ్రహ దోషాలు, గ్రహ పీడలు తొలిగిపోతాయి. ఈ మందార మొక్క మన ఇంట్లో ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అలాగే కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి మంచి ప్రశాంతతను అనుకూలిస్తుంది ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన అన్ని శుభఫలితాలకు దారితీస్తుంది. అయితే కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు ఈ మందార పువ్వులతో ఇలా చెయ్యాలి. అనారోగ్యంతో బాధపడేవారు ఆరు బయట ఒక పాత్రలో నీరును పోసి దానిలో ఏడు మందార పువ్వులను వేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి సూర్యుడికి అనుగుణంగా ఉంచి ఆయనకు ఆర్ద్యం సమర్పించాలి.
నిటారుగా నిలబడి సూర్యుడు వైపు చూస్తూ దండం పెడుతూ ఆయనను వేడుకోవాలి ఇలా 15 రోజులు చేయడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది ఎంతో శక్తివంతమైన సూర్యుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యుడు మీ జాతకంలో బలంగా తయారవుతాడు. మందార పువ్వులతో సూర్యుడిని పూజించడం వల్ల ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.