Goddess Lakshmi: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకూడదు.. చేస్తే డబ్బాంతా?
ప్రతి సమయానికి సమయం సందర్భం ఒకటి ఉంటుంది అని అంటూ ఉంటారు. ఈ మాట నిజమే అని చెప్పవచ్చు.
- By Anshu Published Date - 07:30 AM, Sun - 4 September 22

ప్రతి సమయానికి సమయం సందర్భం ఒకటి ఉంటుంది అని అంటూ ఉంటారు. ఈ మాట నిజమే అని చెప్పవచ్చు. అలాగే ఉదయం లేవగానే ఇలా అయితే కొన్ని పనులు చేయకూడదు అంటారో అదే విధంగా సాయంత్రం సమయంలో కూడా కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదు. ఇలా పొరపాటున కూడా తెలిసి తెలియక చేసే పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతాము. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎప్పటికీ చేయకుండా ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటే ఇప్పుడు మనం తెలుకుందాం. సాయంకాలం సమయంలో ప్రతికూల శక్తులు చురుకుగా ఉంటాయి సాయంత్రం వేళ ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయి.
అందుకే సాయంత్రం సమయంలో పూజలు చేయాలని పెద్దలు చేబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే సాయంత్రం సమయంలో తులసి మొక్కను తాకవద్దు. అలాగే ప్రతిరోజూ ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించడం చాలా శ్రేయస్కరం. తులసి దేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి తులసిని నియమాల ప్రకారం భక్తిశ్రద్ధలతో పూజించే ఇంట్లో, ఆ ఇంట్లో ఎప్పుడు తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది. అలాగే సూర్యాస్తమయం సమయంలో ఇంటిని తుడవడం మరియు ఊడవడం వంటివి చేయకూడదు.
చాలా మంది ప్రజలు ఇంటిని శుభ్రంగా ఉంచడానికి సాయంత్రం కూడా తమ ఇళ్లను తుడిచివేస్తారు, కానీ సూర్యాస్తమయం సమయంలో లేదా తర్వాత తుడుచుకోవడం చాలా అశుభకరం, ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కీ కూడా కోపం వస్తుంది. సాయంత్రం సమయంలో నిద్ర మానుకోండి. సోమరిపోతులకు లక్ష్మి చాలా దూరంగా ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో ఆహారం తినకూడదు. ఆకలిగా ఉంది అని తింటూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్యాస్తమయం సమయంలో ఆహారం తినకూడదు. ముఖ్యంగా మాంసం మరియు చేపలకు దూరంగా ఉండాలి అని చెబుతున్నారు మన నిపుణులు.