Holi: హోలీ పండుగ రోజు ఇలాంటి పనులు చేస్తే చాలు.. దరిద్రం వదిలిపోవాల్సిందే?
హోలీ పండుగ వచ్చింది అంటే చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హో
- By Nakshatra Published Date - 03:03 PM, Thu - 29 February 24
హోలీ పండుగ వచ్చింది అంటే చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హోలీ పండుగ వస్తే పెద్దలు కూడా చిన్న పిల్లలుగా మారిపోతూ ఉంటారు. దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ముఖ్యమైనది. ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరు పేద, ధనిక, తరతమ బేధాలు మరిచి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ జీవితం రంగులు మయం కావాలని కోరుకుంటారు.
అయితే హోలీ పండుగ రోజున కొన్ని మనం పాటించవలసిన నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటిని పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు, పేదరికం పోయి సంపద వర్షం కురుస్తుందని చెబుతున్నారు. మరి హోలీ పండుగ రోజు ఇలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హోలీ నాడు ఇంట్లో శ్రీమహావిష్ణువుని, శ్రీకృష్ణుడిని, రాధాదేవిని, శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజించాలి. అంతేకాదు హోలీ పండుగ రోజున కొన్ని వాసు చిట్కాలను పాటించాలి. అలా పాటిస్తే సంవత్సరం అంతా ఆ ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద, లేదా గృహ ఆవరణంలో హోలీ పండుగను జరుపుకోవాలి. హోలీ ఆడుకోవడానికి కావలసిన రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవాలి.
ముఖ్యంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ వంటి సంతోషాన్ని కలిగించే రంగులను మాత్రమే పూయాలి. ఇలా ఇంట్లో హోలీ ఆడుకోవడం వల్ల ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంటి పైన లక్ష్మీదేవి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి. అంతే కాదు హోలీ పండుగ రోజు గణేశుడిని పూజించి, గులాబీ రంగును పూసి, గణేశుడికి ఇష్టమైన స్వీట్లు నైవేద్యంగా సమర్పించి హోలీ పండుగను జరుపుకోవాలి. అప్పుడు గణేశుడు సంవత్సరం అంతా జీవితం ఎటువంటి విజ్ఞాలు లేకుండా అన్ని పనులు నిర్విఘ్నంగా సాగేలా దీవిస్తాడు. ఇక అంతే కాదు హోలీ రోజు ఒక ప్రత్యేకమైన పని చేయడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. హోలీ రోజు ఈ ఒక్క పని చేస్తే ఇంట్లో ఆనందం ఇంట్లోని దోషాలను తొలగించడంతో పాటు, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి హోలీ రోజున, ఇంటి లోపల, ఇంటి బయట, పచ్చని చెట్లను, మొక్కలను నాటాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం సంవత్సరం అంతా ఉంటుంది. ఇక హోలీ పండుగ నాడు వ్యాపారం అభివృద్ధి చెందడానికి, ధన లాభం కలగడానికి, ఇంటికి కానీ ఆఫీసులకు కానీ తూర్పున ఉదయించే సూర్యుడు చిత్రాన్ని ఉంచుకోవాలని, దీని వల్ల కూడా అదృష్టం ప్రకాశిస్తుందని చెబుతున్నారు.
హోలీ నాడు టెర్రస్ పైన ఈ పని చెయ్యండి ఇక హోలీ పండుగ నాడు ఇంటి టెర్రస్ పై పెట్టుకున్న జై హనుమాన్ జండాను కానీ, శ్రీరామ జెండాను కానీ, బాలాజీకి సంబంధించిన జెండాలను కానీ మార్చడం శుభప్రణామంగా పరిగణించబడుతుంది. హోలీ పండుగ రోజున మనం పూజించే భగవాన్ జెండాను ఇంటికి పై ఎగరవేయడం వల్ల ఆ ఇంట్లో శ్రేయస్సు, సంతోషం పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే హోలీ పండుగ నాడు భగవంతుని పూజించటంతో పాటు, వాస్తు నియమాల ప్రకారం పండుగని సంతోషంగా జరుపుకొని సంతోషంగా జీవించవచ్చు.
Tags
Related News
Vastu Tips For Sleeping: పడుకునేటప్పుడు ఈ వస్తువులు ఉంటే గ్రహ దోషం.. ఇలా నిద్ర పోకూడదు
రాత్రి పడుకునే ముందు భగవత్ గీత లాంటి పవిత్ర గ్రంధాలను తల పక్కన పెట్టి పడుకోవాలి. ఇలా చేస్తే పీడకలలు దరిచేరవు. అవకాశం ఉంటె సువాసన వెదజల్లే పువ్వులను మంచం దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.