Vasthu Tips: అద్దె ఇల్లు అయినా సరే వాస్తు నియమాలు తప్పనిసరి.. లేదంటే?
మామూలుగా సొంత సొంత ఇల్లు లేదంటే అద్దె ఇంట్లో అయినా వాస్తు రీత్యా ఉండాల్సిందే. ఇల్లు వాస్తు ప్రకారం లేకపోతే మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు.
- By Nakshatra Published Date - 06:15 PM, Mon - 29 May 23
మామూలుగా సొంత సొంత ఇల్లు లేదంటే అద్దె ఇంట్లో అయినా వాస్తు రీత్యా ఉండాల్సిందే. ఇల్లు వాస్తు ప్రకారం లేకపోతే మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఏ ఇంట్లో నివసిస్తున్న కూడా ఆ ఇల్లు వాస్తు ప్రకారంగా ఉండాల్సిందే. అంతేకాకుండా ఇంటి కల నెరవేరాలన్నా కూడా అద్దె ఇల్లు వాస్తు రీత్యా ఉండాల్సిందే అంటున్నారు పండితులు. అయితే అద్దె ఇంట్లోకి వెళ్లేముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏటంటంటే.. నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు మాస్టర్ బెడ్రూమ్ ఉందోలేదో చూసుకోవాలి.
ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఈశాన్యంలో ద్వారం, గృహం మధ్యన ఖాళీ ఉండటం అవసరం. నైరుతిలో బాల్కనీ ఉండకూడదు. ఇల్లు దిక్కులు క్రాస్ గా కాకుండా సరిగా ఉండాలి.ప్రతి పోర్షన్ చదరంగా లేదా దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండాలి, వృత్తాకారంలో అస్సలు ఉండకూడదు. నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు. ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి. వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివి కావు. టాయ్లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది.
అంతేకాకుండా అదే ఇంట్లో మీకన్నా ముందు అద్దెకు ఎవరున్నారు, వాళ్లకి కలిసొచ్చిందా లేక మరింత నష్టపోయారా, ఏవైనా ఇబ్బందులు పడ్డారా, యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, ఇంకా అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు జరిగాయా లాంటి విషయాలు కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఆ పోర్షన్ తరచూ ఖాళీ అవుతోందా అన్నది కూడా గమనించాలి. ఎందుకంటే వాస్తు బావున్న ఇళ్లు తరచూ ఖాళీ అవవు.
Related News
Vasthu Tips: ఈ మొక్కని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెడితే చాలు.. మార్పు మీరే గమనించవచ్చు?
మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా వాటిని ఏ దిశ