Vasthu Tips: తలగడ పక్కనే గడియారం పెట్టుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
Vasthu Tips: తలగడ పక్కనే గడియారం పెట్టుకొని పడుకునే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Sat - 22 November 25
Vasthu Tips: మామూలుగా చాలామందికి నిద్రపోయేటప్పుడు తలగడ పక్కన గడియారం లేదా ఫోన్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే లేదా ఎప్పుడు అయినా సరే పడుకున్నప్పుడు అలారం పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇలా పెట్టుకోవడం మంచిది కాదని ఉదయాన్నే లేచి సమయాన్ని చూడటం అసలు మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. కాగా గడియారం టిక్ టిక్ శబ్దం రాహువు శక్తిని కూడా ప్రేరేపిస్తుంది, ఇది భ్రమలు, ఆందోళన, ఇబ్బందులకు కారణమవుతుందట.
అదే సమయంలో, గడియారం మెదడుపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని, దీనివల్ల రాత్రి నిద్రపోవడంలో ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే గడియారంను తలగడ కింద ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందట. తలనొప్పి, మైగ్రేన్, అధిక రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉండవచ్చని చెబుతున్నారు. చాలాసార్లు గడియారం పిల్లల చదువులో కూడా దృష్టిని మరల్చుతుందట. భయంకరమైన కలలు కూడా వస్తాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తలగడ దగ్గర గడియారం ఉంచడం వల్ల శుక్రుడు, చంద్రుని శాంతికి భంగం కలుగుతుందట.
దీనివల్ల అనవసరమైన తగాదాలు, అపార్థాలు దూరం పెరుగుతాయని చెబుతున్నారు. కాగా గడియారం ని బెడ్ కి ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచడం మంచిదట. రాహు కేతు ప్రభావాని పెంచే విషయాలలో ఆగిపోయిన గడియారం నల్లటి రంగు గడియారం త్రిభుజాకార లేదా క్రమరహిత ఆకారపు గడియారం ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయని, డిజిటల్ గడియారాన్ని కూడా తలగడ కింద ఉంచుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. శనివారం నాడు పాత గడియారాన్ని నల్లటి వస్త్రంలో కట్టి ఇంటి నుండి బయటకు తీయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల దాదాపు 21 రోజుల్లో ఇంట్లో ప్రతికూలత తగ్గుతుందని నమ్ముతారు. 11 సార్లు ఓం రాహవే నమః అనే మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు.