Vaishakh Purnima: వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి వీటిని సమర్పిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
వైశాఖపౌర్ణమి రోజు లక్ష్మీదేవికి కొన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కాసుల వర్షం కురవడం ఖాయం అంటున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Sat - 10 May 25

హిందువులు పౌర్ణమిని రోజును చాలా పవిత్రంగా భవిస్తారు. ఈరోజున ప్రత్యేకంగా కొన్ని పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అంతే కాకుండా పవిత్ర నదులలో స్నానాలు చేసి దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని నమ్మకం. మతపరమైన దృక్కోణంలో వైశాఖ పున్నమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వైశాఖ మాసం విష్ణువు ఆరాధన దాన ధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుందర. అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానాలు చేయడంతో పాటు శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి 2025 మే 12న వచ్చింది. పున్నమి రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఇంట్లో అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయట. అటువంటి పరిస్థితిలో, వైశాఖ పౌర్ణమి రోజున, లక్ష్మీ దేవికి తనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలని చెబుతున్నారు. వీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట. ఇంట్లో సంపదకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదని చెబుతున్నారు. వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బటాషా సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి వైశాఖ పూర్ణిమ రోజున అమ్మవారికి కచ్చితంగా మఖానాతో లేదంటే బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. అలాగే వైశాఖ పూర్ణిమ రోజున తెల్లని రంగు స్వీట్లు లేదంటే పాలతో చేసిన కోవా వంటివి నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున సంపద దేవత అయినా లక్మి దేవికి కొబ్బరికాయను సమర్పించాలట. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగిస్తుందట. అలాగే తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనదట. అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించాలని చెబుతున్నారు. వీటితో పాటుగా వైశాఖ పూర్ణిమ రోజున గంగ నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందట. వైశాఖ అమావాస్య రోజున బట్టలు, డబ్బు, ఆహార ధాన్యాలు, పండ్లు దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుందట. దీనితో పాటు ఈ రోజున పాత్రలు, ధాన్యం, తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందట.