Hanuman Puja: ఆంజనేయస్వామిని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?
హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు కొన్ని నియమాలని పాటించాలని, ముఖ్యంగా మహిళలు పూజ చేసేటప్పుడు తప్పకుండా నియమాలను పాటించాలని లేదంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 21 February 25

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. ప్రతి ఒక్క గ్రామంలో హనుమంతుడి ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. అయితే హనుమంతుని పూజించడం మంచిదే కానీ, ఆయనను పూజించేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలట. మరి ముఖ్యంగా మహిళలు పూజ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎవరైనా హనుమంతుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయట. హనుమంతుడు మంచి ఫలితాలను ఇచ్చి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని ఆయన అనుగ్రహం కూడా తప్పక కలుగుతుందని చెబుతున్నారు. ఇకపోతే హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మహిళలు కొన్ని నియమాలని పాటించాలి. ముఖ్యంగా నెలసరి సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతున్నారు. ఆంజనేయస్వామిని ఆరాధించేటప్పుడు పరిశుభ్రతని పాటించాలట. స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత ఇంట్లో పూజ చేసి, ఆలయానికి వెళ్లాలని చెబుతున్నారు.
నెలసరి సమయంలో హనుమంతుడిని పూజించకూడదట. అలా చేయడం అన్నది నిషిద్ధంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు పురుషులైనా, స్త్రీలైనా నమ్మకంతో పూజించాలట. ఆయనఫై పూర్తి విశ్వాసం, భక్తిని కలిగి ఉండాలని చెబుతున్నారు. ఆయన పట్ల మీ విశ్వాసం నిజం కాకపోతే ఆయన ఆశీర్వాదాలను మీరు పొందలేరట. అలాగే హనుమంతుడిని పూజించిన తర్వాత పండ్లు, పువ్వులు, స్వీట్లు, రుచికరమైన వస్తువులని సమర్పించాలట. అలాగే స్త్రీలు ఎట్టి పరిస్థితులలో హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం తాకకూడదని చెబుతున్నారు. అలాగే సింధూరాన్ని కూడా హనుమంతుడి మీద జల్లకూడదట. మహిళలు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఆయన అనుగ్రహాం కోసం హనుమాన్ చాలీసా చదివితే విశేష ఫలితాన్ని పొందవచ్చని చెబుతున్నారు. అలాగే తక్కువ స్వరంతో హనుమంతుని మంత్రాలను జపించాలట. ఇలా చేస్తే కుటుంబంలో హనుమంతుని ఆశీస్సులు ఉంటాయట. సుఖసంతోషాలు పొందవచ్చని,నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు.